Railway Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో భారీగా అప్రెంటీస్ పోస్టులు.. పది పాసైతే చాలు.. పరీక్ష లేకుండానే ఉద్యోగం
Railway Recruitment 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే బోర్డు. రైల్వేలో భారీగా అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. పదో తరగతి పాసైతే చాలు ఎలాంటి వ్రాత పరీక్షలు లేకుండానే మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారు. నెలకు రూ. 20,200 వరకు స్టైఫండ్ కూడా ఉంటుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పలు విభాగాలకు సంబధించిన అప్రెంటీస్ పోస్టులను ప్రకటించింది ఆర్ఆర్ బి. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. చివరి తేదీ ఈనెల 27. ఈ దఫా రిక్రూట్ మెంట్లో మొత్తం 4,232 అప్రెంటీస్ పోస్టులను ఆర్ఆర్ బీ భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో ఖాళీలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పోస్టులు: ఎయిర్ కండీషనింగ్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, పెయింటర్, వెల్డర్ తో పాటు ఇతర విభాగాలు.
అర్హతలు: రైల్వే రిక్రూట్ మెంట్ 2025లో అప్రెంటీస్ పోస్టులకు అప్లికేషన్ దాఖలు చేస్తున్న అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి కనీసం 10వ తరగతి పాసై ఉండాలి. అంతేకాదు సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ కూడా తీసుకుని ఉండాలి. 2024 డిసెంబర్ 28 నాటికి అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీకి వయస్సు పరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం: ఈ రైల్వే రిక్రూట్ మెంట్ 2025లో అప్రెంటీస్ పోస్టుల కోసం ఎలాంటి వ్రాత పరీక్ష లేదు. డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ , వైద్య పరీక్షలతోపాటు మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. ఇక వేతనం రూ. 7,700 నుంచి రూ. 20,200 వరకు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 100, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి:
ఆధార్ కార్డు, పదవి తరగతి మార్క్ షీట్, ఐటీఐ డిప్లొమా, పాస్ పోర్టు సైజు ఫొటో, మరిన్ని వివరాల కోసం www.scr.indianrailways.gov.inని సందర్శించవచ్చు.