SBI Scholarship: విద్యార్థులకు ఎస్బిఐ అదిరే బహుమతి..రూ. 10వేలు ఇలా పొందండి
SBI Scholarship: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన సీఎస్ఆర్ విభాగం ఎస్బిఐ ఫౌండేషన్, ఆశా స్కాలర్ షిప్ పేరుతో పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తోంది.
SBI Scholarship: ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న విద్యార్థుల చదువులకు ఉపయోగపడేందుకు, వారి ప్రతిభను ప్రోత్సహించేందుకు పలు సంస్థలు స్కాలర్ షిప్స్ అందజేస్తుంటాయి. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనీ షియేటివ్ లో భాగంగా స్పెషల్ స్కాలర్ షిప్స్ అందిస్తుంటాయి.
తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన సీఎస్ఆర్ విభాగం ఎస్బీఐ ఫౌండేషన్, ఆశా స్కాలర్ షిప్ పేరుతో పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడంతోపాటు వారికి తోడ్పాటును అందిస్తుంది. ఈ సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ ను సంస్థ తాజాగా రిలీజ్ చేసింది. ఎస్బీఐ ఆశా స్కాలర్ షిప్ 2024 అర్హత, ప్రయోజనాలు, అప్లికేషన్ ప్రాసెస్ ఇతర వివరాల గురించి తెలుసుకుందాం.
ఎస్బిఐ ఫౌండేషన్ సమాజానికి సేవ చేసే కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణ ప్రాంతాలను మెరుగుపరచడం, వైద్యం, విద్య, జీవనోపాధి, యువత సాధికారిత, క్రీడలను ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి. ఈ ఫౌండేషన్ భారతదేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడంపై దృష్టి పెట్టింది.
కాగా ఎస్బీఐ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ఫౌండేషన్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ లో భాగంగా దీన్ని ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ మిషన్ అని పిలుస్తుంటారు. ఈ కార్యక్రమం భారతదేశంలోని తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థుల చదువులను ప్రోత్సహిస్తుంటుంది. దీని ద్వారా 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. విద్యార్థుల టాలెంట్ ఆధారంగా ఏడాదికి రూ. 10వేల వరకు స్కాలర్ షిప్ అందిస్తుంది.
ఎస్బిఐ ఆశా స్కాలర్ షిప్ 2024కి దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ ఆఖరి వరకు చివరి గడువు ఉంది. అధికారిక వెబ్ సైట్ sbifoundation.in ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం ఈ వెబ్ సైన్ సందర్శించండి.