Canara Bank Recruitment: నిరుద్యోగులకు కెనరా బ్యాంక్ గుడ్ న్యూస్..3000వేల ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్..

Canara Bank Recruitment: బ్యాంకులో ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నవారికి కెనరా బ్యాంకులు శుభవార్త తెలిపింది. తాజాగా భారీ సంఖ్యలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పూర్తి వివరాలను చూద్దాం.

Update: 2024-09-26 05:22 GMT

Canara Bank: నిరుద్యోగులకు కెనరా బ్యాంక్ గుడ్ న్యూస్..3000వేల ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్..

 Canara Bank Recruitment: కెనరా బ్యాంకు హ్యుమన్ రిసోర్సెస్ విభాగం భారీ అప్రెంటిస్ రిక్రూట్ మెంట్ ప్రకటన రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా రీజియన్ల వారీగా బ్యాంకు శాఖల్లో అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ లో భాగంగా అర్హులైన అభ్యర్థులు అన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 3000వేల ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ఆన్ లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 4 దరఖాస్తులకు చివరి తేదీ. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్త వివరాలు సెప్టెంబర్ 21వ తేదీన విడుదలయ్యాయి. పూర్తి వివరాలు కెనరా బ్యాంకు అధికారిక వెబ్ సైట్ పై క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు 3000. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 1.09.2024 నాటికి 20 నుంచి 28ఏండ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, బీసీలకు మూడేండ్లు, దివ్యాంగులకు పదేండ్లు వయోసడలింపు ఉంటుంది. ఒక ఏడాది పాటు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభమైంది. చివరి తేదీ అక్టోబర్ 4గా నిర్ణయించారు.

ఇక దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ రిక్రూట్ మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్ మెంట్, కార్పొరేటర్ సెంటర్ తాజాగా భారీ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన 1511 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 4వ తేదీ దరఖాస్తులకు చివరి తేదీ. ఈ పోస్టులకు సంబంధించి రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలు స్టేట్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. 

Tags:    

Similar News