TGPSC Group 1 Mains Exam: రెండో రోజు గ్రూప్-1 పరీక్ష.. నిమిషం ఆలస్యం అయినా... అనుమతించేదిలేదన్న అధికారులు
TGPSC Group 1 Mains Exam: తెలంగాణలో రెండో రోజు గ్రూప్-1 పరీక్షలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి.
TGPSC Group 1 Mains Exam: తెలంగాణలో రెండో రోజు గ్రూప్-1 పరీక్షలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాల వరకూ అభ్యర్థులను పరీక్ష హాలులోకి అనుమతించనుండగా.. నిమిషం ఆలస్యం అయినా.. పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. తొలిరోజు 22 వేల 744 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా.. మొత్తంగా 72.4 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.
కాగా నిన్న ఒక్క నిమిషం ఆలస్యమైన కారణంగా కొందరు విద్యార్థులు పరీక్షకు దూరం అయ్యారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా కొనసాగింది. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతించకపోవడం మినహా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కర ఘటనలు జరగలేదని TGPSC పేర్కొంది. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 31383 మంది పరిక్షకు హాజరుకావల్సి ఉండగా అందులో హైదరాబాద్ పరిధిలోనే 5 వేల 613 మంది పరీక్ష రాయాల్సి ఉండగా కేవలం 87.23 శాంతం అంటే 4 వేల 896 మంది మాత్రమే పరీక్ష రాశారు. మరో 717 మంది గైర్హాజరయ్యారు.
రంగారెడ్డి పరిధిలో 8 వేల 11 మందికి గాను 5 వేల 854 మంది ఎగ్జామ్ రాశారు. మరో 2 వేల 157 మంది పరీక్షకే రాలేదు. ఈ నెల 27వరకు గ్రూప్ 1 మెయిన్స్ కొనసాగానున్న నేపథ్యంలో అన్ని పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని TGPSC భావిస్తోంది.