Railway Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..32,438 ఉద్యోగాలకు రైల్వే శాఖ త్వరలోనే నోటిఫికేషన్

Update: 2024-12-24 01:48 GMT

Railway Jobs: నిరుద్యోగులకు రైల్వే శాఖ త్వరలోనే భారీ శుభవార్త తెలుపనుంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ చేసిన రైల్వే శాఖ మరో నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) డిసెంబర్ 2024లో తన అధికారిక వెబ్‌సైట్ @rrbcdg.gov.inలో 32,438 ఖాళీల కోసం గ్రూప్ D రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.

ఈ నోటిఫికేషన్ లో అర్హతలు, ఎంపిక ప్రక్రియ గురించి వివరంగా సమాచారాన్ని అందించింది. ఆర్ఆర్ బి గ్రూప్ డి రిక్రూట్ మెంట్ 2025కోసం పరీక్ష విధానం, అభ్యర్థులు రిక్రూట్ మెంట్ ప్రక్రియపై సమగ్ర గైడ్ కోసం అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. 32,438 గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి ఆర్ఆర్ బి త్వరలోనే అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. జనవరి 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. అత్యధికంగా ట్రాక్ మెయింటైనర్ ఉద్యోగాలు 13,187, పాయింట్స్ మెన్ 5058, అసిస్టెంట్ 3077, అసిస్టెంట్ సహా మరికొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. 18 నుంచి 36ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతి లేదా ఎన్సీవీటీ నుంచి ఎన్ఈసీ సర్టిఫికేట్, ఐటీఐ ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు.

కాగా ఇప్పటికే ఇండియన్ రైల్వే బోర్డు 1,036 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. వేర్వేరు కేటగిరీల్లో దాదాపు 1036 ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. ఈ పోస్టులకు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్ హిందీతో పాటు పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తితో పాటు అర్హత కలిగిన అభ్యర్ధులు జనవరి 7, 2025 నుంచి అన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags:    

Similar News