Indeed Survey: ఆఫీస్ టైమ్ ముగిసినా వదట్లేదు: భారతీయ ఉద్యోగులపై సర్వేలో సంచలన విషయాలు

Indeed Survey: పనివేళలు ముగిసినా కూడా 90 శాతం భారతీయ ఉద్యోగులను ఆయా సంస్థల బాస్ లు, యాజమాన్యాలు తరచుగా సంప్రదిస్తున్నాయి.

Update: 2024-10-07 12:46 GMT

Indeed Survey: ఆఫీస్ టైమ్ ముగిసినా వదట్లేదు: భారతీయ ఉద్యోగులపై సర్వేలో సంచలన విషయాలు

Indeed Survey: పనివేళలు ముగిసినా కూడా 90 శాతం భారతీయ ఉద్యోగులను ఆయా సంస్థల బాస్ లు, యాజమాన్యాలు తరచుగా సంప్రదిస్తున్నాయి. సెలవు దినాల్లో లేదా అనారోగ్య సెలవులు పెట్టిన సమయాల్లో కూడా ఉద్యోగులకు తమ కార్యాలయాల నుంచి సమాచారం కోసం ఫోన్లు వస్తున్నాయని గ్లోబల్ జాబ్ మ్యాచింగ్ ఫ్లాట్ ఫామ్ ఇండీడ్ సర్వే తెలిపింది.

సర్వే ఏం చెప్పిందంటే?

ఇండీడ్ తరపున సెన్సస్ వైడ్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ లో 500 కంపెనీల యజమానులు, 500 మంది ఉద్యోగులను సర్వే చేశారు. పోటీ ప్రపంచంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఈ సర్వేలో బయటకు వచ్చాయి. వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోవడంలో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీస్ సమయం పూర్తైన తర్వాత కూడా ఆఫీస్ కు అందుబాటులో ఉండడం ముఖ్యంగా యువత మానసిక, శారీరక శ్రమకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

రైట్ టూ డిస్కనెక్ట్

పనివేళలు ముగిసిన తర్వాత కూడా ఆఫీస్ నుంచి వచ్చే ఫోన్లకు స్పందించకుండా ఉండేందుకు గాను రైట్ టూ డిస్కనెక్ట్ హక్కు ఉండాలనే వాదన తెరమీదికి వచ్చింది. ఆఫీస్ సమయం తర్వాత ఆఫీస్ నుంచి వచ్చే కమ్యూనికేషన్లను విస్మరించడానికి చట్టపరమైన లేదా సంస్థాగత స్వేచ్ఛ ఉంటుంది.

ఈ సర్వేలో పాల్గొన్న పది మంది భారతీయ యజమానుల్లో ఎనిమిది మంది రైట్ టూ డిస్కనెక్ట్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఉద్యోగులు పనివేళలు, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవాలి. అంకితభావం, విధేయతకు విలువ ఇవ్వడంలో భాగంగా వ్యక్తిగత సమయాన్ని రక్షించుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఉద్యోగులు ఒత్తిడితో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది.

ఆఫీస్ పనివేళలు దాటితే

ఆఫీస్ పనివేళలు పూర్తైన తర్వాత కుటుంబం కోసం సమయం కేటాయించే విషయంలో స్పష్టమైన సరిహద్దులను నిర్ణయించుకోవాలి. డ్యూటీ ముగిసిన తర్వాత మీ వ్యక్తిగత సమయం గురించి మీ టీమ్ , సూపర్ వైజర్లకు తెలపాలి. అత్యవసర పరిస్థితుల్లో మినహా ఇతర సమయాల్లో ఆఫీస్ కు అందుబాటులో ఉండననే నియమాన్ని అమలు చేయాలి. ఆఫీస్ టైమ్ పూర్తికాగానే ఈమెయిల్స్, మేసిజింగ్, ఇతర కమ్యూనికేషన్ పరికరాలకు చెందిన నోటిఫికేషన్లను ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే మీరు విశ్రాంతి తీసుకోవడానికి దోహదం చేస్తుంది.

ఇంట్లో స్క్రీన్ సమయాన్ని తగ్గించాలి

మీ వ్యక్తిగత సమయాల్లో స్క్రీన్ సమయాన్ని తగ్గించడం ద్వారా మీ మనస్సు, శరీరాన్ని రీఛార్జ్ చేయడంలో సహాయపడుతుంది. పుస్తకం చదవడం, వాకింగ్ చేయడంతో మీ కళ్ళకు విరామం లభిస్తుంది. మీకు మరింత రిలాక్స్డ్ అనుభూతిని కలిగిస్తుంది. అధిక స్క్రీన్ సమయం ముఖ్యంగా సాయంత్రం మీ మెదడును అతిగా ఉత్తేజపరుస్తుంది. ఇది నిద్రకు దూరం చేసే అవకాశం ఉంది.

మీ కుటుంబం లేదా స్నేహితులతో మాట్లాడటం

కుటుంబ సభ్యులు లేదా ఇష్టమైన వారితో గడపడానికి సమయం కేటాయించాలి. దీని వల్ల పని సంబంధిత ఒత్తిడి నుండి బయటకు వస్తారు. వ్యక్తిగత సంబంధాలు మరింత మెరుగుపడుతాయి. మీరు విశ్వసించే వ్యక్తులతో మీ ఆలోచనలు లేదా ఆందోళనలను పంచుకోవడం కూడా కొత్త దృక్పథాన్ని అందిస్తుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.

శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వాలి

తగినంత నిద్ర పోవడం, తేలికపాటి శారీరక శ్రమ చేయడం ఉత్తమం. తగినంత నిద్ర మీ మెదడు సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి సహాయపడుతుంది. అయితే వ్యాయామం శారీరక ఆరోగ్యానికి దోహదపడుతుంది. పని ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. తేలికపాటి వ్యాయామాలు ఎండార్పిన్లను విడుదల చేస్తాయి. ఇవి సహజంగా మీ మానసికస్థితిని మెరుగుపరుస్తాయి.

Tags:    

Similar News