Secunderabad Aemy Public School Jobs: సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉద్యోగాలు..ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
Secunderabad Aemy Public School Jobs : సికింద్రాబాద్ లోని ఆర్కే పురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2025-26 అకాడమిక్ ఇయర్ కు గాను టీచింగ్ ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. రెగ్యులర్, ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లో భాగంగా పీజీటీ, టీజీటీ విభాంలో ఇంగ్లీష్, హిందీ , మ్యాథ్స్, సోషల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్, సైన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ పిటిఐ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇక పీఆర్టీ, హెడ్ మిస్ట్రెస్, ప్రీ ప్రైమరీ టీచర్స్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.
పోస్టులను బట్టి డిగ్రీ, బీఈడీ అర్హత ఉండాలి. సంబంధిత కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాదు సీటెట్ లేదా టెట్ ఉత్తీర్ణత ఉండాలి. పనిచేసిన అనుభవం తప్పనిసరి అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 40ఏళ్లలోపు ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 250 చెల్లించాలి. జనవరి 25,2025తేదీలోపే అప్లికేషన్స్ పంపాల్సి ఉంటంది. ఇక దరఖాస్తు ఫీజును డీడీ రూపంలో చెల్లించాలి. Aemy Public School RK Puram పేరుతో డీడీ చెల్లించాలి. ఆన్ లైన్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే దరఖాస్తు ఫామ్ ను నింపి ది ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్ కే పురం సికింద్రాబాద్ అడ్రస్ కు పంపించాలి. https://apsrkpuram.edu.in/వెబ్ సైట్లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.