Jobs: నిరుద్యోగులకు పండగే.. 2027 నాటికి ఆ రంగంలో 24 లక్షల ఉద్యోగాలు..!

Jobs: ప్రముఖ జాబ్‌ రిక్రూట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌ ఇండీడ్‌ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 2027 నాటికి ఆ రంగంలో 24 లక్షల ఉద్యోగాలు రానున్నాయని తెలిపింది.

Update: 2025-01-10 05:27 GMT

Jobs: నిరుద్యోగులకు పండగే.. 2027 నాటికి ఆ రంగంలో 24 లక్షల ఉద్యోగాలు..!

Jobs: ప్రముఖ జాబ్‌ రిక్రూట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌ ఇండీడ్‌ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 2027 నాటికి ఆ రంగంలో 24 లక్షల ఉద్యోగాలు రానున్నాయని తెలిపింది. ఇంతకీ ఏంటా రంగం.? ఎలాంటి ఉద్యోగాలు రానున్నాయి లాంటి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

ప్రస్తుతం దేశంలో క్విక్ కామర్స్‌ రంగం ఓ రేంజ్‌లో విస్తరిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు అన్ని ఈ కామర్స్‌ సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. వినియోగదారులకు తక్కువ సమయంలో వస్తువులను డెలివరీ చేస్తున్నాయి. బ్లింకిట్‌, స్విగ్గీమార్ట్‌, జెప్టో వంటివి కేవలం 10 నుంచి 20 నిమిషాల్లో వస్తువులను డెలివరీ చేస్తున్నాయి.

అయితే ఇప్పుడిప్పుడే ఈ సేవలను టైర్‌ 2 పట్టణాల్లోనూ తీసుకొస్తున్నారు. కేవలం నిత్యవసర వస్తువులు మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ను సైతం క్విక్‌ కామర్స్‌ పరిధిలోకి తీసుకొస్తున్నాయి కంపెనీలు. భవిష్యత్తులో ఈ రంగం మరింత అభివృద్ధి చెందడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. దేశంలో క్విక్‌ కామర్స్‌ రంగం వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో బ్లూకాలర్‌ ఉద్యోగ నియామకాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

భారత్‌లో 2027 నాటికి ఈ తరహా ఉద్యోగాలు 24 లక్షలు అవసరం అవుతాయని అంచనా వేసింది. పండగ సీజన్‌లో కొనుగళ్లు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో గత త్రైమాసికంలో క్విక్‌ కామర్స్‌ కంపెనీలు 40,000 మందిని నియమించుకున్నాయని ఇండీడ్‌ ఇండియా సేల్స్‌ హెడ్‌ శశి కుమార్‌ తెలిపారు. బ్లూకాలర్‌ ఉద్యోగాలు ఎక్కువగా చదువు కంటే అనుభవం ఉన్న వారికే లభిస్తాయి.

ముఖ్యంగా డెలివరీ డ్రైవర్లు, రిటైల్‌ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఎక్కువగా ఉంటారు. ‘భారత్‌లో క్విక్‌ కామర్స్‌ పరిశ్రమ వేగవంత వృద్ధి దిశలో సాగుతోంది. ఈ వృద్ధికి తగ్గట్లుగా గిరాకీ అవసరాలను తీర్చేందుకు బ్లూకాలర్‌ నియామకాలు చేపట్టడమూ గణనీయంగా పెరుగుతుంద’ని శశి కుమార్‌ చెప్పుకొచ్చారు. క్విక్‌ కామర్స్‌ రంగంతో పాక్షిక నైపుణ్యమున్న ఉద్యోగులకు గిరాకీ పెరుగుతుందని తెలిపారు.

ఇక ఇండీడ్ సర్వే ప్రకారం.. బ్లూకాలర్‌ ఉద్యోగులకు సగటున నెలకు సుమారు రూ.22,600 వేతనం లభిస్తోంది. చెన్నై, పుణె, బెంగళూరు, ముంబయి, దిల్లీ లాంటి ప్రధాన నగరాల్లో నియామకాలు ఎక్కువగా ఉంటున్నయాని క్విక్‌ కామర్స్‌ రంగం వేగంగా విస్తరించడమే ఇందుకు కారణమని సర్వేలో పేర్కొన్నారు. చండీగఢ్, అహ్మదాబాద్‌ లాంటి టైర్‌ 2 నగరాల్లోనూ ఉద్యోగకల్పన పెరుగుతోంది. 

Tags:    

Similar News