SSB Recruitment 2023: నిరుద్యోగులకి అలర్ట్.. సశాస్త్ర సీమ బల్‌లో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు..!
SSB Recruitment 2023: సాయుధ బలగాలలో పనిచేయాలనే యువతకి ఇది సువర్ణవకాశమని చెప్పాలి.
SSB Recruitment 2023: సాయుధ బలగాలలో పనిచేయాలనే యువతకి ఇది సువర్ణవకాశమని చెప్పాలి. ఎందుకంటే సశాస్త్ర సీమ బల్ బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కంపెనీ హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుల కోసం ఆసక్తిగల అభ్యర్థుల అధికారిక వెబ్‌సైట్ssbrectt.gov.in సందర్శించి అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఈ హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు జూన్ 18, 2023 వరకు సమయం ఉంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా సశాస్త్ర సీమా బల్‌కు చెందిన గ్రూప్-సి నాన్-గెజిటెడ్‌లో మొత్తం 914 పోస్టుల భర్తీ జరుగుతుంది.
హెడ్ కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్) - 15 పోస్టులు
హెడ్ కానిస్టేబుల్ (మెకానిక్ - పురుషుడు) - 296 పోస్టులు
హెడ్ కానిస్టేబుల్ (స్టీవార్డ్) - 2 పోస్టులు
హెడ్ కానిస్టేబుల్ (వెటర్నరీ) - 23 పోస్టులు
హెడ్ కానిస్టేబుల్ (కమ్యూనికేషన్) - 578 పోస్టులు
మెకానిక్, ఎలక్ట్రీషియన్ స్టీవార్డ్, వెటర్నరీ, కమ్యూనికేషన్ హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా దానికి సమానమైన డిగ్రీ కలిగి ఉండాలి. ఇది కాకుండా దరఖాస్తుదారులు సంబంధిత ట్రేడ్‌లో ఒకటి నుంచి రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. SSB హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 100 చెల్లించాలి. కాగా, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళా అభ్యర్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
వయో పరిమితి
ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎలక్ట్రీషియన్, స్టీవార్డ్, వెటర్నరీ, కమ్యూనికేషన్ హెడ్ కానిస్టేబుల్‌ల వయోపరిమితిని 18 నుంచి 25 సంవత్సరాలుగా నిర్ణయించారు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు కూడా ఉంటుంది.
ఈ పోస్టులకి ఎలా దరఖాస్తు చేయాలి..?
1. మొదటగా ssb.nic.inకి వెళ్ళండి
2. హోమ్‌పేజీలో 'SSB రిక్రూట్‌మెంట్ 2023' లింక్‌పై క్లిక్ చేయండి.
3. ఆ తర్వాత 'Apply Online' అనే లింక్‌పై క్లిక్ చేయండి.
4. ఇప్పుడు అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.
5. నిర్ణీత దరఖాస్తు రుసుమును చెల్లించండి.
6. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి.
7. ప్రింట్ తీసి దగ్గర ఉంచుకోండి.