Career News: మీరు ఈ సబ్జెక్ట్‌ని చదివి ఉంటే చాలా ఉద్యోగాలకి అర్హులు.. ఉత్తమ కెరీర్ ఎంపిక..!
Career News: మీరు మానవ ప్రవర్తన, చరిత్ర, సంస్కృతి పట్ల ఆకర్షితులవుతున్నారా?
Career News: మీరు మానవ ప్రవర్తన, చరిత్ర, సంస్కృతి పట్ల ఆకర్షితులవుతున్నారా? రాజకీయ, ఆర్థిక వ్యవస్థల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? సమాజంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారనే దానిపై ఆసక్తి ఉంటే, సామాజిక సేవల్లో ఉద్యోగం చేయాలనే ఇష్టం ఉంటే సోషల్ సైన్సెస్ కోర్సులు చదవవచ్చు. సాంఘిక శాస్త్రాలలో పని చేయడం వల్ల పబ్లిక్ పాలసీని ప్రభావితం చేయవచ్చు. ప్రజలకు సహాయం చేస్తు ప్రపంచంలో మార్పు తెచ్చే అవకాశం లభిస్తుంది. అంతేకాదు సాంఘిక శాస్త్రం అధిక వేతనంతో కూడిన ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది. ఇందులో నైపుణ్యం సాధించడానికి మీరు చేయవలసిందల్లా స్పష్టమైన దృష్టి ఉందని, సరైన మార్గంలో ఉన్నారని నిర్ధారించుకోవడం మాత్రమే.
పొలిటికల్ సైంటిస్ట్
మీకు రాజకీయాలపై ఆసక్తి ఉంటే రాజకీయ శాస్త్రవేత్తగా కెరీర్ ఎంచుకోవచ్చు. ఇది సాంఘిక శాస్త్ర వృత్తిలో అత్యధిక వేతనం పొందే ఉద్యోగం. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా రాజకీయ వ్యవస్థ ఎలా పని చేస్తుందో రాజకీయ శాస్త్రవేత్తలు పరిశోధిస్తారు. వారు రాజకీయ పోకడలను అనుసరిస్తారు కొత్త రాజకీయ విధానాలు, ఆలోచనలను అభివృద్ధి చేస్తారు. శాస్త్రవేత్తలుగా వారు డేటాను సేకరించి విశ్లేషిస్తారు.
ఎకనామిస్ట్
ఎకానమీ అనేది డబ్బు గురించి మాత్రమే కాదు అన్ని రకాల వనరుల గురించి తెలుపుతుంది. ఆర్థికవేత్తలు విద్య, శక్తి, ఆరోగ్య సంరక్షణ, వినియోగదారు ఉత్పత్తుల ధరలను పరిశీలిస్తారు. వారు ఈ క్రింది రంగాలలో పని చేయవచ్చు. పబ్లిక్ ఫైనాన్స్, లేబర్ ఎకనామిక్స్, ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ ఎకనామిక్స్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, మాక్రో ఎకనామిక్స్ అండ్ మైక్రో ఎకనామిక్స్
అర్బన్, రీజినల్ ప్లానర్
సోషల్ సైన్స్ గ్రాడ్యుయేట్లు తమ కెరీర్‌ను అర్బన్, రీజినల్ ప్లానర్‌గా చేసుకోవచ్చు. నగరాల్లో స్మార్ట్ సిటీ మిషన్ కింద దేశంలోని పట్టణీకరణ ఈ ప్లానర్‌లకు డిమాండ్‌ను పెంచింది. ప్రణాళిక, ప్రతిపాదనలు, పర్యావరణ నిబంధనలు, జోనింగ్, బిల్డింగ్ కోడ్‌లకు అనుగుణంగా ఉన్నాయని అర్బన్, రీజినల్ ప్లానర్లు నిర్ధారిస్తారు.
సోషియాలజిస్ట్
మీరు వ్యక్తులు పరస్పరం వ్యవహరించే విధానంపై ఆసక్తి కలిగి ఉంటే సామాజిక శాస్త్రంలో కెరియర్ చేయవచ్చు. సామాజిక శాస్త్రవేత్తలు ప్రజల మధ్య సామాజిక సంబంధాలను పరిశీలిస్తారు. వారిలో ప్రజా సంబంధాలను చూస్తారు. సామాజిక సంస్థలలో ఉద్యోగాలు పొందవచ్చు. రిసెర్చ్ చేయవచ్చు.