Inter Exams: రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు

Inter Exams: పరీక్షలకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

Update: 2023-03-14 05:07 GMT

Inter Exams: రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు

Inter Exams: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీటికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇంటర్‌ పరీక్షల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ సైతం ఏర్పాట్లు చేసింది.. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ఆర్టీసీ చేయూతనందిస్తోంది. . రోడ్లపై ప్యాడ్‌ ఎత్తి చూపిస్తే బస్సు ఎక్కడైనా ఎక్కించుకునే విధంగా డ్రైవర్లకు ఆదేశాలు వెళ్లాయి.

ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు హాల్‌ టికెట్లు ఇవ్వడానికి ఎవరైనా ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు ఇబ్బంది పెడితే విద్యార్థులు నేరుగా ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీనిపై ప్రిన్సిపాల్‌ సంతకం లేకపోయినప్పటికీ పరీక్షలకు అనుమతిస్తారు.

పరీక్ష ప్రారంభం నుంచి చివరి వరకు కూడా వైద్య సిబ్బంది కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటారు. విధులు నిర్వర్తించే ఏఎన్‌ఎం వద్ద మందులతో పాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. .ప్రతి కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అదికారులు ఆదేశాలు జారీ చేశారు.విద్యార్థులు డ్యూయల్‌ డెస్క్‌లపై పరీక్షలు రాసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మూత్రశాలలను పరిశుభ్రం ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై స్థానిక తహసీల్దార్లు పరిశీలించి అధికారులకు నివేదిక ఇస్తారు.

పరీక్షా కేంద్రాల వద్ద ఒక్క నిమిషం నిబంధనను అమలు చేస్తున్నారు. దీని కోసం కఠిన ఆంక్షలు అమలులో ఉన్నాయి. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకుంటే మంచిదని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ లోమొత్తం 233 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్టియర్ 84, 223 మంది హారవుతున్నారు. సెకెండ్ ఇయర్ పరీక్షకు 86, 923 మంది హాజరవుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో 182 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్టియర్ పరీక్షకు 71, 773 మంది, సెంకండ్ ఇయర్ కు 55,883 మంది హాజరవుతున్నారు. మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లాలో 133 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫస్టియర్ పరీక్షకు 63, 794 మంది, సెకండ్ ఇయర్ కు 55,144 మంది హాజరవుతారు.

పరీక్ష రాసే విద్యార్థులకు సైకాలజిస్టులు పలు సూచనలు చేస్తున్నారు. పరీక్షలంటే భయం వీడాలి. తోటి విద్యార్థులతో పోల్చుకోవద్దు. అర్థరాత్రి వరకూ చదవవద్దని చెబుతున్నారు. అలాగే ఉదయం వ్యాయామం చేయాలి.ఏకాగ్రతను దెబ్బతీసే విషయాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. పరీక్షలయ్యే వరకూ ఇంటిలోని సమస్యల గురించి ఆలోచించకూడదంటున్నారు. 

Tags:    

Similar News