SSC Recruitment: ఇంటర్ పూర్తి చేస్తే చాలు. ప్రభుత్వ ఉద్యోగం మీదే..2వేలకు పోస్టులకు నోటిఫికేషన్

SSC Recruitment: ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి ఎస్ఎస్సీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా గ్రేడ్ సి, గ్రేడ్ డి స్టేనో గ్రాఫర్ పోస్టులు మొత్తంగా 2006 భర్తీ చేయనున్నారు.

Update: 2024-07-29 08:21 GMT

 SSC Recruitment:ఇంటర్ పూర్తి చేస్తే చాలు. ప్రభుత్వ ఉద్యోగం మీదే..2వేలకు పోస్టులకు నోటిఫికేషన్

SSC Recruitment:ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా. అయితే కేంద్ర ప్రభుత్వం మీకో గుడ్ న్యూస్ చెప్పింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా ఇంటర్ అర్హతతో భారీ రిక్రటూ్ మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో స్టేనో గ్రాఫర్ పోస్టుల భర్తీకి ఎస్ ఎస్సీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా గ్రేడ్ సి, గ్రేడ్ డి స్టెనో గ్రాఫర్ పోస్టులు మొత్తంగా 2006 భర్తీ కానున్నాయి. అర్హత ఉన్నవారు అధికారిక వెబ్ సైట్ ssc.gov.in ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి గడువు ఆగస్టు 17న ముగుస్తుంది. ఆగస్టు 27 నుంచి 28 వరకు దరఖాస్తుల ఎడిట్ కు ఛాన్స్ ఉంటుంది. రిక్రూట్ మెంట్ డ్రైవ్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. అంటే 1994 ఆగస్టు 2 నుంచి 2006 ఆగస్టు 1 మధ్య పుట్టిన వారు అర్హులు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డి పోస్ట్‌లకు అప్లై చేసుకోవాలంటే అభ్యర్థి వయసు 18 నుంచి 27 ఏండ్లలోపు ఉండాలి. 1997 ఆగస్టు 2 నుంచి 2006 ఆగస్టు 1 మధ్య పుట్టినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు:

గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు SSC స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం:

- ముందుగా ఎస్ఎస్సీ అధికారిక పోర్టల్ ssc.gov.in ను తెరవాలి.

- హోమ్‌పేజీలోకి వెళ్లి ‘స్టెనోగ్రాఫర్ గ్రూప్-సి, గ్రూప్-డి’ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను చెక్ చేసుకోవాలి.

- తర్వాత ‘లాగిన్’ > ‘రిజిస్టర్ నౌ’ క్లిక్ చేసిన అనంతరం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభించాలి.

- ముందుగా పర్సనల్ వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ చేసి.. రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి, అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి.

దరఖాస్తు రుసుము :

జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.100..ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

పరీక్ష విధానం:

ఆన్‌లైన్ ఎగ్జామ్ వ్యవధి 2 గంటలు ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్ ల్వాంగేజ్‌లో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ మోడల్‌లో పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సెక్షన్స్ లో ఉంటుంది. మొదటి 2 సెక్షన్స్ నుంచి 50 చొప్పున ప్రశ్నలు, చివరి సెక్షన్ నుంచి 100 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఎగ్జామ్ మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. 

Tags:    

Similar News