GATE 2025 రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ రేపే... ఇలా అప్లై చేసుకోండి

GATE 2025 registration last date: లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవడానికి మాత్రం అక్టోబర్ 7 వరకూ గడువుంది.

Update: 2024-09-25 13:56 GMT

GATE 2025 registration last date

GATE 2025 registration last date: GATE 2025 పరీక్షకు రిజిస్టర్ చేసుకోవడానికి ఆఖరు తేదీ 26 సెప్టెంబర్. ఐఐటి-రూర్కీ నిర్వహిస్తున్న గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ -2025 (GATE)కు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఈ లింక్ క్లిక్ చేయండి: gate2025.iitr.ac.in.

లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవడానికి మాత్రం అక్టోబర్ 7 వరకూ గడువుంది.

గేట్-2025 రిజిస్ట్రేషన్ ఎలా?

1. ఐఐటి – గేట్ వెబ్ సైట్ gate2025.iitr.ac.in లోకి వెళ్లండి.

2. హోమ్ పేజిలోని గేట్-2025 రిజిస్ట్రేషన్ అనే లింక్ క్లిక్ చేయండి

3. రిజిస్ట్రేషన్ డిటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఓపెన్ అయిన కొత్త పేజీలో మీ వివరాలు పూర్తి చేయండి

4. పూర్తి చేశాక సబ్మిట్ బటన్ క్లిక్ చేసి, అకౌంట్లోకి లాగిన్ అవండి

5. ఇప్పుడు దరఖాస్తు ఫారం పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి

6. ఆ తరువాత అప్లికేషన్ ఫీజు చెల్లించండి

7. సబ్మిట్ క్లిక్ చేసి కన్ఫర్మేషన్ పేజి డౌన్లోడ్ చేసుకోండి

8. హార్డ్ కాపీ ప్రింట్ తీసి జాగ్రత్తగా భద్రపరచండి.

గేట్ 2025కు దరఖాస్తు చేసుకోవడానికి కావలిసిన డాక్యుమెంట్స్:

1. ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం అభ్యర్థి ఫోటో

2. బులెటిన్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం అభ్యర్థి సంతకం

3. కేటగిరీ కేస్ట్ సర్టిఫికేట్ (ఎస్సీ/ఎస్టీ) పీడీఎఫ్ ఫార్మాట్‌

4. పీడబ్ల్యుడి సర్టిఫికేట్ – పీడీఎఫ్ (అవసరమైతే)

5. డిస్లెక్సియా సర్టిఫికేట్ – పీడీఎఫ్ (అసవరమైతే)

6. ఫోటో ఐడి: ఆధార్ లేదా పాస్ పోర్ట్ లేదా పాన్ కార్డ్ లేదా ఓటరు ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యు.డి,మహిళలకు రూ. 900. లేట్ ఫీజుతో కలిపి రూ. 1400

ఇతరులకు రూ. 1800. లేట్ ఫీజుతో కలిపి రూ. 2300

ఇంజనీరింగ్ విద్యార్థులు ఐఐటి, ఎన్ఐటి, ఐఐఐటి వంటి సంస్థలలో పీజీ/ పీహెచ్‌డీ చేయడానికి గేట్ క్వాలిఫై కావాలి. అంతేకాదు, ఓఎన్‌జీసీ, బీహెచ్ఈఎల్, హెచ్పీసీఎల్, డిఆర్డీఓ, సెయిల్, గెయిల్ వంటి ప్రీమియర్ ప్రభుత్వ రంగం సంస్థలలో జాబ్ కోసం కూడా గేట్ తప్పనిసరి.

పీజీ ప్రోగ్రామ్స్‌లో అడ్మిషన్ కోసం, పీఎస్‌యూ జాబ్స్‌లో చేరడం కోసం గేట్ రాయడం తప్పనిసరి. ఒకసారి గేట్ క్వాలిఫై అయితే ఆ స్కోర్ కార్డు మూడేళ్ళపాటు చెల్లుబాటు అవుతుంది.

Tags:    

Similar News