Certificate Courses: ఈ సర్టిఫికెట్ కోర్సులు చేస్తే భారీ వేతన ప్యాకేజీలు.. కెరీర్‌లో సులువుగా ఎదగొచ్చు..!
Certificate Courses: చాలా మంది యువత గ్రాడ్యుయేషన్ తర్వాత డబ్బు సంపాదించడానికి ఉద్యోగం చేయాలా, బిజినెస్ చేయాలా అని ఆలోచిస్తారు.
Certificate Courses: చాలా మంది యువత గ్రాడ్యుయేషన్ తర్వాత డబ్బు సంపాదించడానికి ఉద్యోగం చేయాలా, బిజినెస్ చేయాలా అని ఆలోచిస్తారు. మీరు ఇలాంటి సందిగ్ధంలో ఉంటే కొన్ని విషయాలను గమనించాలి. వాస్తవానికి కాలేజ్ తర్వాత కెరీర్ వృద్ధికి మంచి ఆప్షన్ ఉండే కోర్సును చేయాలి. దీనివల్ల బాగా డబ్బు సంపాదిస్తారు. అలాంటి కొన్ని సర్టిఫికేట్ కోర్సుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
వెబ్ డిజైనింగ్ కోర్సు
ప్రస్తుతం ఏ కంపెనీకైనా వెబ్ డిజైనర్ అవసరం. వెబ్ డిజైనింగ్ లేకుండా ఆన్‌లైన్ అమ్మకాలు అసంపూర్తిగా ఉంటాయి. వెబ్ డిజైనింగ్ కోర్సులు, వెబ్ డెవలపర్‌లకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇది కాకుండా మీరు పెద్ద కంపెనీలో పనిచేయడమే కాకుండా సొంత వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు.
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కోర్సు
బ్యాచిలర్ డిగ్రీ తర్వాత మీరు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కోర్సు చేయవచ్చు. ఇది మీకు మెరుగైన కెరీర్ ఎంపికగా చెప్పవచ్చు. ఈ సర్టిఫికేట్ కోర్సు చేసిన వెంటనే మీకు ఆకర్షణీయమైన ప్యాకేజీతో మంచి ఉద్యోగం లభిస్తుంది. మీకు ఈ రంగంపై ఆసక్తి ఉంటే సొంత సంస్థను ప్రారంభించవచ్చు.
సైబర్ సెక్యూరిటీ కోర్సు
సైబర్ దాడుల ద్వారా మోసగాళ్లు ప్రజల జేబులను ఖాళీ చేయడానికి అనేక మార్గాలను వెతుకుతుంటారు. ఈ పరిస్థితిలో సైబర్ సెక్యూరిటీ నిపుణులు రహస్య డేటాను హ్యాక్ చేయకుండా కాపాడుతారు. కావాలంటే మీరు ఎథికల్ హ్యాకింగ్ కోర్సు చేయవచ్చు. ఈ రెండు రంగాల్లో నిపుణులకు డిమాండ్ బాగా పెరుగుతోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు
ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక రంగాలలో పట్టు సాధించింది. భవిష్యత్‌లో ఇది ప్రతి రంగానికి అవసరం అవుతుంది. దీనివల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయి. అదే సమయంలో సైన్స్ విద్యార్థులకు AI కోర్సు డబ్బు సంపాదించడానికి గొప్ప కెరీర్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ కోర్సులకు ఎల్లప్పుడు డిమాండ్ ఉంటుంది. ఇందులో ఏదో ఒకటి చేసి జీవితంలో సెట్ కావొచ్చు.