Telangana: విషాదం..నీటి తొట్టెల్లో పడి ముగ్గురు చిన్నారులు దుర్మరణం
Telangana:మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం నెలకొంది. నీటి తొట్టెల్లో పడి ముగ్గురు చిన్నారులు మరణంచారు. ఈ ఘటనలు బుధవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో చోటుచేసుకున్నాయి.
Telangana: మహబూబ్ నగర్ జల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. నీటి తొట్టెల్లో పడి ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులు మరణించారు. ఈ ఘటనలు బుధవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకున్నాయి. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలం బలభద్రాయపల్లికి చెందిన నర్సింలు, కవితలకు ఇద్దరు కుమారులు ఉన్నారు. నిహాన్స్ 3 ఏండ్లు, భానుమూర్తి 2ఏండ్లు ఉన్నారు. బుధవారం నర్సింలు పొలం పనులకు వెళ్లారు. కవిత అనారోగ్యంతో నిద్రపోయింది. వాకిట్లో నీటిని నింపుకునేందుకు సిమెంట్ రింగులతో నీటి తొట్టెను ఏర్పాటు చేశారు. పిల్లలు ఇద్దరూ కూడా ఆడుకుంటూ అందులో పడిపోయారు. కొద్దిసేపటికి కుటుంబీకులు చూసి కోస్గీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే వారిద్దరు మరణించినట్లు వైద్యులు తెలిపారు.
మరో ఘటనలో మహబూబ్ నగర్ జిల్లా రుసుంపల్లికి చెందిన శ్రీహరి, లలిత దంపతుల కుమార్తె గౌతమిని ఇంట్లో అమ్మమ్మ, తాత దగ్గర వదిలి పొలం పనులకు వెళ్లారు. ఈ చిన్నారి ఆడుకుంటూ పశువుల నీరు తాగడానికి ఏర్పాటు చేసిన నీటితొట్టెలో పడి మరణించింది. అభం శుభం చిన్నారులు మరణించడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.