Police Alert: ఈ నెంబర్ల నుంచి ఫోన్స్ వస్తున్నాయా? అస్సలు లిఫ్ట్ చేయకండి
Do not lift phone calls from these numbers: మారిన టెక్నాలజీతో పాటు నేరాల శైలి కూడా మారుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, పోలీసులు, అధికారులు ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతోన్నా సైబర్ మోసగాళ్లు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. రకరకాల మార్గాల్లో ప్రజలను దోచుకుంటున్నారు. ముఖ్యంగా తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ చేస్తూ మోసం చేస్తున్నారు. ఇటీవల ఈ రకమైన మోసాలు పెరిగిపోతున్నాయి.
దీనిని దృష్టిలో పెట్టుకుని తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు ఓ ప్రకటన చేశారు. కొన్ని రకాల నెంబర్ల నుంచి కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ చేయొద్దని చెబుతున్నారు. వీటిలో ముఖ్యంగా.. +94777 455913, +37127913091, +56322553736, +37052529259, +255901130460 లాంటి నెంబర్ల నుంచి కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.
+371 (లాత్వియా), +375 (బెలారస్), +381 (సెర్బియా), +563 (లోవా), +370 (లిథువేనియా), +255 (టాంజానియా) వంటి కోడ్‌లతో మొదలయ్యే నెంబర్లతో ఫోన్ చేస్తున్నారు. కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే హ్యాంగ్ చేస్తారని అధికారులు చెబుతున్నారు. పొరపాటున వారికి తిరిగి ఫోన్ చేస్తే మీ ఫోన్‌లోని కాంటాక్ట్ వివరాలతో పాటు బ్యాంకు, క్రెడిట్ కార్డు ఇతర వివరాలు మూడు సెకన్లలో కాపీ చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
కాల్ చేసిన సమయంలో 90 లేదా 09 నెంబర్లను ఎవరైనా నొక్కాలని చెబితే.. అస్సలు చేయకూడదని చెబుతున్నారు. ఇలా చేస్తే మీ సిమ్ కార్డుని యాక్సెస్ చేయడానికి, మీ ఖర్చుతో కాల్ చేయడానికి, మిమ్మల్ని నేరస్థుడిగా చేయడానికి కుట్రపన్నుతున్నట్లుగా గుర్తించాలని తెలిపారు. చూశారుగా తెలియని నెంబర్ నుంచి కాల్ వస్తుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి లిఫ్ట్ చేయడమే ఉత్తమం.