AP: ఏపీలో విషాదం..ఫ్లెక్సీ కడుతుండా కరెంట్ షాక్..నలుగురు యువకులు మృతి
AP: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. కరెంటు షాకుతో నలుగురు మరణించారు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.
AP: ఏపీలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంలో నలుగురు యువకులు మరణించారు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో జరిగింది. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సందర్బంగా ఫ్లెక్సీలు కడుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతులు పామర్తి నాగేంద్ర, మారిశెట్టి మణికంఠ, బొల్లా వీర్రాజు, కాసగాని కృష్ణగా గుర్తించారు.
మృతదేహాలను తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించగా..తీవ్రగాయాలైన కోమటి అనంతరావును చికిత్స నిమిత్తం తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఉండ్రాజవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా పాపన్నగౌడ్ విగ్రహా ఆవిష్కరణకు సంబంధించి ఏడాదిన్నరగా రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈమధ్యే ఇరుపక్షాలతో చర్చింది కొవ్వూరు సబ్ కలెక్టర్ రాణి సుస్మిత పర్మిషన్ ఇచ్చారు. ఈ ఉదయం సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా విగ్రహం ఆవిష్కరణ జరిగింది. ఈలోగా ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రి కందుల దుర్గేశ్ మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.