Road Accident: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు హైదరాబాద్ వాసులు దుర్మరణం

Update: 2024-11-09 03:00 GMT

Road Accident: తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు..ఏడుగురు దుర్మరణం

Road Accident: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుల్బార్గా జిల్లా కమలాపురం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనం కారును ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు.

మరణించివారంతా హైదరాబాద్ లోని యూసుఫ్ గూడకు చెందినవారు గుర్తించారు. గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి వీరు వెళ్లుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అటు ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 5 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ బస్సు మధుర నుండి లక్నోకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఫిరోజాబాద్ సమీపంలో హైవేపై ఆగి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ బస్సులో దాదాపు 25 మంది ప్రయాణిస్తున్నారు.

ఇందులో 8 మంది పిల్లలు కూడా ఉన్నారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో బస్సుపై అదుపు తప్పి హైవేపై ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టినట్లు తెలిపారు. 

Tags:    

Similar News