Nude Video Call : తెలంగాణ ఎమ్మెల్యేకు అర్థరాత్రి న్యూడ్ వీడియో కాల్స్...పోలీసులకు ఫిర్యాదు

Cyber Crime: ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెచ్చుమీరుతున్నాయి. రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. గిఫ్టులు, ఈ కేవైసీలు, లాటరీలు, డ్రగ్స్ పార్సిల్స్ వంటి కాల్స్ తోపాటు తాజాగా న్యూడ్ కాల్స్ వీడియో కాల్స్ చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.

Update: 2024-10-19 03:35 GMT

రోజుకో రకంగా సైబర్ కేటుగాళ్లు అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వీడియో కాల్స్ చేసి అందులో న్యూడ్ గా కనిపిస్తున్నారు. ఇటు నుంచి కాల్ లిఫ్ట్ చేయగానే..రికార్డు చేసి డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

లేదంటే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. సామాన్యులకే కాదు..ఎమ్మెల్యేలకు కూడా న్యూడ్ కాల్స్ బెడద తప్పడం లేదు.

న్యూడ్ వీడియో కాల్స్ బెడద వణికిస్తోంది. తాజాగా తెలంగాణలో ఓ ఎమ్మెల్యే కూడా ఈ న్యూడ్ వీడియో కాల్స్ బారినపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యేకు ఈనెల 14వ తేదీన అర్థరాత్రి వీడియో కాల్ వచ్చింది. గుర్తుతెలియన నెంబర్ నుంచి ఆ వీడియో రావడంతో ఆ ఫోన్ లిఫ్ట్ చేశారు ఎమ్మెల్యే. దీంతో వెంటనే ఫోన్ స్క్రీన్ పై మహిళ నగ్నంగా కనిపించింది.

దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన ఎమ్మెల్యే వెంటన్ ఆ కాల్ ను కట్ చేశారు. అయితే తనపై కుట్ర పన్నేందుకు ఎవరైనా అలా న్యూడ్ వీడియో కాల్ చేశారా లేక నిజంగానే గుర్తుతెలియని వ్యక్తులే చేసి ఉంటారా అనే అనుమానం ఎమ్మెల్యేకు వచ్చింది. తన పరువు, ప్రతిష్టను దిగజార్చడంతోపాటు బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశ్యంతోనే ఎవరైనా ఈ పని చేసి ఉంటారా అనే సందేహంతో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్న ఫోన్ నెంబర్ ఎవరిది అనే విషయం కనుక్కునే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Tags:    

Similar News