Fatal Road Accident In Ap: ఏపీలో ఘోరరోడ్డు ప్రమాదం, జీడి పిక్కల లారీ బోల్తా పడి ఏడుగురి కార్మికుల దుర్మరణం
Fatal Road Accident: ఏపీలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో జీడిపిక్కల లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీలో ప్రయాణిస్తున్న ఏడుగురు కార్మికులు ఘటనాస్థలంలోనే మరణించారు. లారీ బోల్తాపడటంలో బస్తాల కింద కార్మికులు చిక్కుకున్నారు. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ పరారయ్యాడు.
Fatal Road Accident: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం బొర్రంపాలెం నుంచి జీడిపిక్కల లోడుతో తాడిపళ్ల గ్రామానికి వెళ్తున్న మినీలారీ అదుపుతప్పిబోల్తా కొట్టింది. మితిమీరిన వేగంతో ప్రయాణించడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో లారీలో ప్రయాణిస్తున్న ఏడుగురు కార్మికులు మరణించారు.
ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు జీడిపిక్కల సంచుల లోడుతో వెళుతున్నారు. ఆరిపాటి దిబ్బలు-చిన్నాయి గూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపానికి రాగానే వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి పంట బోదెలోకి దూసుకెళ్లి బోల్తా పడింది.పక్కనే ఉన్న పంట కాల్వలోకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో లారీలో వెనక జీడిపిక్కల సంచులపై కూర్చొన్న కూలీలు బస్తాల మధ్య ఇరుక్కుపోయారు.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. లారీ బోల్తా పడటాన్ని గుర్తించిన స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో 8 మంది కూలీలు ఉన్నారు.ఒకరు క్యాబిన్‌లో ఉండగా మిగిలిన 7గురు జీడి బస్తాలపై కూర్చున్నారు.
ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇదే లారీలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు గాయాలతో బయటపడగా..చికిత్స పొందుతున్నారు. కాగా మరణించినవారంతా తాడిమళ్లకు చెందిన దేవాబత్తుల బూరయ్య, తమ్మిరెడ్డి సత్యనారాయణ, పి.చినముసలయ్య, కత్తవ సత్తిపండు, తాడికృష్ణ, నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికిచెందిన బొక్క ప్రసాద్ లుగా గుర్తించారు.