Tamannaah Bhatia: మనీలాండరింగ్ కేసులో నటి తమన్నా..5 గంటలపాటు విచారించిన ఈడీ

Tamannaah Bhatia: 'హెచ్‌పిజెడ్ టోకెన్' మొబైల్ యాప్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసు దర్యాప్తుకు సంబంధించి నటి తమన్నా భాటియాను దర్యాప్తు సంస్థ ఈడీ గురువారం ప్రశ్నించింది. ఈ యాప్‌లో బిట్‌కాయిన్, కొన్ని ఇతర క్రిప్టోకరెన్సీలను మైనింగ్ చేస్తున్నారనే సాకుతో చాలా మంది ఇన్వెస్టర్లను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Update: 2024-10-18 00:53 GMT

Tamannaah Bhatia : మనీలాండరింగ్ కేసులో నటి తమన్నా..5 గంటలపాటు విచారించిన ఈడీ

Tamannaah Bhatia: 'హెచ్‌పిజెడ్ టోకెన్' మొబైల్ యాప్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసు దర్యాప్తుకు సంబంధించి నటి తమన్నా భాటియాను దర్యాప్తు సంస్థ గురువారం ప్రశ్నించినట్లు ఈడీ అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ యాప్‌లో బిట్‌కాయిన్, కొన్ని ఇతర క్రిప్టోకరెన్సీలను మైనింగ్ సాకుతో చాలా మంది ఇన్వెస్టర్లను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇందులో తమన్నాపై ఎలాంటి ఆరోపణలు లేవు.

కానీ ఈడీ గౌహతి కార్యాలయంలో విచారించింది. అంతుకుముందు ఈడీ కార్యాలయానికి తమన్నా తన తల్లితో కలిసి వెళ్లింది. ప్రస్తుతం వాంగ్మూలం తీసుకున్నట్లు సమాచారం. యాప్ ను ప్రమోట్ చేశారని..అందుకు కొంత డబ్బు తీసుకున్నారని..అయితే తమన్నాపై ఎలాంటి నేరారోపణలు లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అయితే తమన్నాను ఈడీ విచారించడం ఇది రెండవ సారి. అంతముకు ముందు మహాదేవ బెట్టింగ్ యాప్ కేసులోనూ తమన్నాను ఈడీ విచారించింది. మహాదేవ అనుబంధ సంస్థ అయిన ఫెయిర్ ప్లే యాప్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ గేమ్ మ్యాచులను ప్రసారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

దీనిపై మహారాష్ట్ర సైబల్ సెల్ ఏప్రిల్ లో విచారణకు పిలిచింది. మార్చిలో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లో 76చైనీస్ కంట్రోల్ సంస్థలతో సహా 299 సంస్థలను నిందితులుగా చేర్చింది. దీనిలో 10 మంది చైనీస్ మూలాలుఉన్న డైరెక్టర్లు కూడా ఉన్నారు. రెండు సంస్థలు ఇతర విదేశీ పౌరులతో కలిసి నియంత్రించాయని పేర్కొంది. కొహిమా పోలీసులకు చెందిన సైబర్ క్రైమ్ యూనిట్ దాఖలు చేసిన ఎఫ్ఐర్ ఆధారంగా మనీలాండరింగ్ కేసు అనేది వెలుగులోకి వచ్చింది.

ఇందులో బిట్ కాయిన్, ఇతర భారీ రాబడి వస్తుందని చెప్పి ఇన్వెస్టర్లను మోసగించినందుకు ఐసీపీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలను మోపారు. నిందితులు పెట్టుబడిదారులను మోసం చేసేందుకు హెచ్ పీజెడ్ టోకెన్ మొబైల్ ఫోన్ అప్లికేషన్ను ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు.

నేరాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తరలించేందుకు డమ్మీ డైరెక్టర్లతో షెల్ కంపెనీల తరపున బ్యాంకు అకౌంట్లు, మర్చంట్ డీలు తెరచినట్లు ఈడీ వెల్లడించింది. రూ. 57వేల పెట్టుబడి పెడితే మూడు నెలల పాటు రోజుకు రూ. 4వేల రిటర్న్స్ ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. అయితే పెట్టుబడి పెట్టిన వారికి కేవలం 1 నెల మాత్రమే డబ్బులు చెల్లించారు. ఈ తర్వాత ఈడీ దారులు నిర్వహించి రూ. 455కోట్ల విలువైన స్థిరాస్తులు, డిపాజిట్లను స్వాధీనం చేసుకుంది. 

Tags:    

Similar News