Mumbai: ముంబైలో ఘాతుకం..సూట్ కేసులో డెడ్ బాడీ..నిందితులెవరో తెలుస్తే షాక్

Mumbai: ముంబైలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని హత్య చేసిన బ్యాగ్ లో పెట్టి తీసుకెళ్తుండగా..ముంబై పోలీసులు పట్టుకున్నారు. దాదర్ రైల్వే స్టేషన్ లో బ్యాగులో డెడ్ బాడీని గుర్తించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-08-06 04:46 GMT

 Mumbai: ముంబైలో ఘాతుకం..సూట్ కేసులో డెడ్ బాడీ..నిందితులెవరో తెలుస్తే షాక్.

Mumbai: మహారాష్ట్రలోని దాదర్ రైల్వే స్టేషన్‌లో బ్యాగ్‌లో మృతదేహం కనిపించడంతో కలకలం రేగింది. ఓ వ్యక్తిని హత్య చేసి రైలులో సూట్‌కేస్‌లో మృతదేహాన్ని తీసుకెళ్తున్న ఇద్దరు నిందితులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్), గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జిఆర్‌పి) సోమవారం ఉదయం లగేజీని తనిఖీ చేస్తుండగా బ్యాగ్‌ అనుమానాస్పదంగా కనిపించింది. తెరిచి చూడగా అందులో మృతదేహం కనిపించింది. విచారణలో పిధుని పోలీస్‌స్టేషన్‌ పరిధిలో హత్య జరిగినట్లు తేలింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..స్నేహితురాలి విషయంలో గొడవపడి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు జై ప్రవీణ్ చావ్డా, శివజిత్ సురేంద్ర సింగ్ గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ శాంతా క్రూజ్ లో నివాసం ఉంటున్న అర్హద్ అలీ షేక్ ను హత్య చేశారు. హత్యానంతరం మృతదేహాన్ని పారవేసేందుకు నిందితులు ఆదివారం రాత్రి టుటారీ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించాలని ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు. దాదర్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి రైల్వే స్టేషన్‌లో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పారిపోయినప్పటికీ ఉల్హాస్‌నగర్‌లో అరెస్టు చేశారు.

Dead body in bag in Mumbai Dadar railway station, two arrestedఅనుమానితులిద్దరూ చెవిటి,మూగవారు. సంకేత భాషను ఉపయోగించి కమ్యూనికేట్ చేస్తారు. దర్యాప్తులో సహాయం కోసం పోలీసులు సంకేత భాషా నిపుణుడి సహాయాన్ని తీసుకున్నారు. ఇది హత్యకు గల కారణాలను తెలుసుకోవడంలో సహాయపడింది. మహిళా స్నేహితురాలి విషయంలో ప్రధాన నిందితుడు చావ్డా బాధితుడు షేక్‌తో గొడవ పడ్డాడు.స్నేహితురాలిని చావ్డా తన ఇంట్లో పార్టీకి ఆహ్వానించాడు. ఈ సమయంలో మళ్లీ వివాదం చెలరేగింది. దీంతో చావ్డా అర్హత్ అలీషేక్ ను సుత్తితో బాది హత్య చేశాడు. మృతదేహాన్ని పూర్తిగా ప్లాస్టిక్‌ కవర్ లో చుట్టి సూట్ కేసులో కుక్కి..పారేయ్యాలన్న ప్లాన్ చేశారు. ఈనేపథ్యంలో సూట్ కేసుతో దాదర్ రైల్వే స్టేషన్ కు వచ్చారు. సూట్ కేసుపై అనుమానం వచ్చిన పోలీసులు తెరిచి చూసేసరికి అందులో డెడ్ బాడీ కనిపించింది. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన నిందితులను పట్టుకుని అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది.

Tags:    

Similar News