Assam Gang Rape: అసోం మైనర్ గ్యాంగ్ రేప్ ప్రధాన నిందితుడు మృతి..క్రైమ్ సీన్ రిపీట్ చేస్తుండగా
Assam Gang Rape: అసోంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు చెరువులో దూకి మరణించాడు. శనివారం తెల్లవారుజామున పోలీసులు క్రైమ్ సీన్ రిపీట్ చేస్తుండగా నిందితుడు చెరువులోకి దూకినిట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలించగా 2 గంటల తర్వాత డెడ్ బాడీ లభించినట్లు పోలీసులు ప్రకటించారు.
Assam Gang Rape: అస్సాంలోని ధింగ్‌లో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులలో ఒకరు శనివారం తెల్లవారుజామున చెరువులో దూకి మరణించాడు. ఆగస్ట్ 23 రాత్రి, పోలీసులు అరెస్టు చేసిన నిందితులను నేరస్థలానికి తీసుకువెళ్లారు. ఘటనకు సంబంధించిన క్రైమ్ సీన్ రీక్రియేట్ చేస్తున్న సమయంలో నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నిస్తూ సమీప చెరువులోకి దూకాడు. దీంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. పోలీసులు సహాయంతో SDRF బృందం ఈ ఉదయం చెరువు నుండి నిందితుడి మృతదేహాన్ని వెలికితీసింది.
ఆగస్టు 22వ తేదీ సాయంత్రం ఢింగ్ ప్రాంతంలో 14 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన తరువాత, ధింగ్ ప్రాంతంలో భారీ ఎత్తున నిరసనలు మొదలయ్యాయి. అక్కడ స్థానిక ప్రజలు, వివిధ సంస్థలు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అస్సాం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జిపి సింగ్ శుక్రవారం సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీనియర్ పోలీసు అధికారులతో కూడా మాట్లాడారు.
కాగా ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శుక్రవారం మాట్లాడుతూ, “మహిళలపై ఏదైనా అఘాయిత్యం జరిగినప్పుడు, మేము త్వరగా చర్యలు తీసుకోవాలి, అయితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి. ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ప్రజలు భావించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి. ఢింగ్‌లో హిందూ మైనర్‌కు సంబంధించిన ఘటనకు పాల్పడిన వారిని శిక్షిస్తామని ఆయన అన్నారు. రోడ్డున పక్కన స్పృహ కోల్పోయి పడి ఉన్న బాలికను గుర్తించిన స్థానికులు ఆమె ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.