High Court : అనుచిత వ్యాఖ్యలు చేసిన భార్యపై కేసు పెట్టొచ్చు
High Court : భర్తపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కేసు పెట్టిన భార్యకు కర్నాటక కోర్టు భారీ షాకిచ్చింది. ఆమెపై కేసు పెట్టేందుకు ఆమె భర్తకు పూర్తి స్వచ్చను కల్పించింది.
High Court : భర్తపై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టిన భార్యకు కర్నాటక హైకోర్టు షాకిచ్చింది. ఆమెపై కేసు పెట్టేందుకు కోర్టు ఆమె భర్తకు పూర్తి స్వేచ్ఛను కల్పించింది. భర్తలో అమెరికాలో ఉంటున్నాడు. పెళ్లి తర్వాత రెండు నెలల తర్వాత హెచ్ 1 బీ వీసా గడువు ముగియనుండటంతో తిరిగి ఆయన అమెరికాకు వెళ్లాడు.
తన భార్యను కూడా అమెరికా తీసుకెళ్లేందుకు 5సార్లు అపాయింట్ మెంట్లకు తీవ్ర ప్రయత్నం చేశాడు. కానీ ఆమె అమెరికా వెళ్లేందుకు ఇష్టపడలేదు. దీంతో ఆయన 2021 డిసెంబర్ 3న విడాకుల కోసం బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టులో అప్లయ్ చేసుకున్నాడు.
2022 ఫిబ్రవరి 3న తన భర్తపై భార్య ఫిర్యాదు చేసింది. తనను అదనపు వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. మేజిస్ట్రేట్ కోర్టు దీనిని 2022 జూన్ 14న విచారణకు ఆదేశించింది. భార్య కోర్టుకు హాజరై తన భర్తకు లైంగిక రోగం ఉందని ఆరోపణలు చేసింది. అయితే రాజీకోసం ప్రయత్నిస్తే రూ. 3కోట్లు డిమాండ్ చేసినట్లు భర్త ఆరోపించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ నాగ ప్రసన్న ఈ కేసు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
భార్యకు స్త్రీ ధనం 614 గ్రాముల వెండి, 160 గ్రాముల బంగారం ఇచ్చారని గమనించారు. భార్య తల్లి, సోదరుడు ఇచ్చిన స్టేట్ మెంట్లు, చార్జీషిట్లులోని వివరాలను పరిశీలించగా భర్త వరకట్నం డిమాండ్ చేసినట్లు కానీ, క్రూరత్వం ప్రదర్శించినట్లు కానీ వెల్లడి కాలేదు. దీంతో ఆ భార్యపై కేసు పెట్టేందుకు భర్తకు అనుమతి ఇచ్చింది కోర్టు.