Building Collapses: గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం..గోడకూలి 8 మంది చిన్నారులు
Building Collapses: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది చిన్నారులు గోడకింద ఇరుక్కుపోయారు. అందులో ముగ్గురు చిన్నారులు మరణించారు.
Building Collapses: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో శుక్రవారం రాత్రి ఘోరప్రమాదం జరిగింది.సూరజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖోడానా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో గోడకింద 8 మంది చిన్నారులు ఇరుక్కుపోయారు. ఇందులో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మరో ఐదుగురు చిన్నారులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..గ్రేటర్ నోయిడాలో నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలిపోయినట్లు పోలీసులు సమాచారం అందించారు స్థానికులు. ఒక్కసారిగా నిర్మాణంలో ఉన్న గోడకూలిపోవడంతో దాని కింద 8 మంది చిన్నారులు ఇరుక్కుపోయారు. స్థానికులు సహాయంతో 8 చిన్నారులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ముగ్గురు చిన్నారులు మరణించినట్లు వైద్యులు తెలిపారు. మిగిలిన ఐదుగురు చిన్నారులు చికిత్స పొందుతున్నారు. సగీర్ అనే వ్యక్తి ఇంటి గోడ కూలిపోవడంతో అతని కుటుంబం, బంధువుల పిల్లలు అందులో ఇరుక్కుపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అయేషా వయస్సు 16 సంవత్సరాలు, అహద్ 4 సంవత్సరాలు, హుస్సేన్ వయస్సు 5 , అదిల్ 8 అల్ఫీజా 2, సోహ్నా 12 సంవత్సరాలు, వాసిల్ 11 సంవత్సరాలు, సమీర్ 15 సంవత్సరాలు ఉన్నారు. వీరిలో అహద్, ఆదిల్, అల్ఫిదా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
అటు శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-1 పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో 4 వాహనాలు ధ్వంసమయ్యాయి. అందులో ఒకరు మరణించారు. 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబానికి రూ.20 లక్షలు, క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.