ప్రత్యేకహోదా కోసం హస్తినలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. రాష్ట్రంకోసం ఐదురోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముగ్గురు వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వరప్రసాద్ ల ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మిగిలిన ఇద్దరు ఎంపీల ఆరోగ్యపరిస్థితి కూడా ఆందోళనకరంగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమరణ దీక్షలో ఉన్న ఆ ఇద్దర్ని కూడా ఆస్పత్రిలో చేరిస్తే ఏమౌవుతుంది. టీడీపీలాగా ఢిల్లీలో తట్టబుట్టా సర్ధుకొని ఏపీలో పోరాటం అంటూ తరలిస్తారా..? లేదంటే ఏమైనా వ్యూహాలు రచయించే పనిలో ఉన్నారా..? అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఇప్పటి వరకు రాష్ట్ర కోసం ఆమరణ దీక్ష ఏ విధంగా చేశారో అలానే దీక్ష కొనసాగించేలా వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముగ్గురు ఆస్పత్రిలో ఇద్దరు ఆమరణదీక్షలో ఉండగా వారి ఆరోగ్యం క్షీణిస్తే తదుపరి కార్య చరణను జగన్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
ఆరోగ్యం క్షీణించిందని ఆమరణ దీక్షను విరమిస్తే చేసిన పోరాటం వృదా అవుతుందనే భావనలో ఉన్నారట జగన్.
టీడీపీ నేతలు హస్తినలో పోరాటం చేసినా..ఫలితం లేకపోవడంతో పోరాటాన్నిరాష్ట్రానికి షిఫ్ట్ చేశారు. దీంతో టీడీపీ మైలేజ్ తగ్గిందనే టాక్ నడుస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న జగన్ ఎట్టి పరిస్థితిల్లో పోరాటాన్ని నిలిపివేయకుండా, కొనసాగించాలని ఓ ప్లాన్ వేశారట. ఆ ఫ్లాన్ ప్రకారం టీడీపీ కంటే తామే ఏపీకి కోసం పోరాటం చేస్తున్నట్లు మైలేజ్ తెచ్చుకోవచ్చని జగన్ భావిస్తున్నారట.
ప్రస్తుతం హస్తినలో ఐదుగురు లోకసభ ఎంపీలతో ఆమరణ నిరాహార దీక్ష చేయించిన జగన్ , ఆ ఎంపీల ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రికి తరలిస్తే వారి స్థానంలో రాజ్యసభ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లతో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించాలనేది జగన్ వ్యూహమట. వాళ్లు వయసు రిత్యా నాలుగైదు రోజుల కంటే ఆమరణ దీక్షలో కొనసాగే పరిస్థితి ఉండదు. వాళ్ల ఆరోగ్యం క్షీణిస్తే ఆ తరువాత వైసీపీ పోరాటం పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్ధకంగా మారింది.
అయితే దీనికి కూడా జగన్ ముందే ప్లాన్ వేసుకున్నారట. రాజ్యసభ ఎంపీల దీక్ష భగ్నం అయితే ఎమ్మెల్యేల్ని రంగంలోకి దించుతారట. మొత్తానికి పోరాటం ఉధృతం చేసేలా జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రత్యామ్నాయ పోరాటాల ద్వారా కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చి ఏరో ఒక ప్రకటన చేయించడం ద్వారా వైసిపి నే ప్రత్యేక హోదా సాధనకు చిత్త శుద్దితో గట్టి పోరాటం చేసిందని ప్రజల దృష్టిలో విశ్వాసం సంపాదించేలా చేయవచ్చని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది