పసిపిల్లలు నిద్రలో ఎందుకు నవ్వుతారు.. వాళ్లకు ఏమి గుర్తొస్తే నవ్వడం మొదలు పెడతారనే విషయం మనసులో ఎప్పుడైనా తట్టిందా..? ‘నవ్వొచ్చింది కాబట్టి’ పిల్లలు నవ్వావుతారని మాత్రం చెప్పొద్దు.. ఇలాంటి సిల్లీ సమాధానాలు విని విని విసుగు చెందిన బ్రిటన్ పరిశోధకుడు డా.ఆడ్‌మన్ ఈ తేలికైన సమాధానంతో తృప్తి పడదలుచుకోలేదు. పసిపిల్లల నిద్రలో నవ్వుల వెనక కారణాలను తెలుసుకోవడానికి నడుం కట్టాడు. దేశదేశాలు తిరిగి పరిశోధనలు చేశాడు. పసిపిల్లలు నిద్ర సమయంలో ఎందుకు నవ్వుతారు? ఎలా నవ్వుతారు?
మొదలైన వాటితో ఒక ప్రశ్నావళిని రూపొందించి తల్లిదండ్రుల ముందుంచి లోతైన అధ్యయనానికి పూనుకున్నాడు ఆడ్‌మన్. నవ్వు, చిరునవ్వులు... అనేవి పిల్లలు ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునే తీరును ప్రతిఫలిస్తాయి అంటాడు ఆడ్‌మన్. మగ శిశువులతో పోల్చితే, ఆడ శిశువులు తక్కువగా నవ్వుతారట. మగ శిశువులు రోజులో 50సార్లు నవ్వితే, ఆడశిశువుల మాత్రం 37 సార్లు నవ్వుతారట.
సాధారణంగా పసిపిల్లలు గోడకు రకరకాల జంతువుల స్టికర్లు అతికించి పిల్లలకు వాటిని చూపి స్పందన తెలుసుకోవడం(కొందరు నవ్వుతారు... కొందరు నవ్వరు) కానీ నిద్రలో పిల్లలు ఎందుకు నవ్వుతారో ఇప్పటికి అర్ధంకానీ ప్రశ్న.. అందుకే ఆడ్‌మన్ ఈ పరిశోధన చేపట్టారని తెలుస్తుంది.. దీంతో పాటు ఆధునిక సాంకేతిక జ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుంటున్నారు. ఆడ్‌మన్ పరిశోధన తీరును చూస్తే భవిష్యత్‌లో పిల్లల నవ్వులకు సంబంధించి విలువైన సమాచారం లభించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.. ఈ పరిశోధన గనక విజయవంతమయితే పిల్లలు అసలు నిద్రలో ఎందుకు నవ్వుతారో ఏమి వినిపిస్తే ఎక్కువగా నవ్వుతారో ఇట్టే తెలుసుకోవచ్చు..