మొన్నా ఆ మధ్య బాలీవుడ్ హీరోయిన్ కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎదురు చూస్తున్నారనే వార్తలు విన్నాం. ఆ ముద్దుగుమ్మ ఎవరు అని నెట్టింట్లో అభిమానులు ఒకటే హడావిడి. తీరా చూస్తే సైఫ్ అలీఖాన్ మొదటి భార్య కూతురు సారా అలీఖాన్. ప్రభాస్ సాహో సినిమా తరువాత రాధకృష్ణ డైరక్షన్ లో కొత్త సినిమా చేయనున్నాడు. అసలే బహుబలితో ప్రంపచాన్ని ఆకర్షించిన ప్రభాస్ రేంజ్ మారింది. ప్రభాస్ ఫేమ్ ను దృష్టిలో ఉంచుకొని భారీ క్యాస్టింగ్ క్రూ ఉండేలా సదరు నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు.
అందుకు తగ్గట్లే సాహోలో బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్ సెలక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. మరి రాధాకృష్ణ డైరక్షన్ లో వచ్చే కొత్త మూవీ కోసం అదే తరహాలో హీరోయిన్ల కోసం జల్లెడ పట్టిందట చిత్ర యూనిట్ సైఫ్ కూతురు సారాని సెలక్ట్ చేశారు. స్టోరీ లైన్ వినిపిస్తే , తాను యాక్ట్ చేసే విషయం లో తన తల్లి సారా సలహా తీసుకోవాలని చెప్పిందట. ప్రస్తుతం ప్రభాస్ సారా తల్లి నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారట. ప్రస్తుతానికి ఈ ముద్దుగుమ్మ బికినీ వివాదంలో చిక్కుకుంది. అసలే సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో ఏ చిన్న తప్పుదొరికినా కథల్ని పుంకాలు పుంకాలుగా అల్లేస్తుంటారు. దీనిపై స్పందించేందుకు కూడా సిద్ధపడరు సినిమా వాళ్లు.
అయితే సారా బిగ్ బాస్ కంటెస్టెంట్ వికాస్ గుప్తతో ఓ ఫోటో దిగింది. ఫోటో దిగితేనే రచ్చచేసే ఔత్సాహికులు..బికినీ వేసుకొని మరి ఫోటో దిగితే ఊరుకుంటారా..? వారిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలపై వికాస్ గుప్త, సారా వివరణ ఇచ్చారు. పాడించ్చేరి లో జరిగిన ఓ వర్క్ షాపులో పాల్గొన్నప్పుడు తామిద్దరు ఫ్రెండ్స్ అయినట్లు వికాస్ వివరణిచ్చాడు. స్నేహితులం కదా అని ఫోటో దిగాం. ఆ ఫోటోని సారా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయడం తో నేను స్క్రీన్ షాట్ తీసుకొని నేను షేర్ చేసుకున్నా అని తెలిపాడు.