బయటపడిన 6వేల ఏళ్ల క్రితం నాటి అస్థిపంజరం

Update: 2018-09-28 04:56 GMT

బ్రెజిల్ లో ఓ భవన నిర్మాణం చేపడుతుండగా సుమారు 6వేల ఏళ్ల నాటి అస్థిపంజరం బయటపడింది. ఇది శాంటా కాటరిన రాష్ట్రము ఇల్హోత మున్సిపాలిటీలో వెలుగులోకి వచ్చింది. అక్కడ ఇటీవల ఓ బహుళ భవన నిర్మాణానికి గుంతలు తవ్వుతుండగా మనిషి అవశేషం గుర్తించబడింది. దీనిపై పురావస్తు పరిశోధకులు వెలికితీసి పరిశోధన చేపట్టారు. ఈ అస్థిపంజరం సుమారు 6వేల ఏళ్ల క్రితం నాటిదని.. ఇది జికుబు తెగకు చెందిన అవశేషం అయిఉండొచ్చని వారు భావిస్తున్నారు. ఈ తెగ వాళ్లు 10 వేల ఏళ్ల క్రితం బ్రెజిల్‌కు వలస వచ్చినట్టుగా గుర్తించారు. అయితే ఈ అవశేషానికి 32 పళ్లలో ఒక్కటి కూడా ఊడకుండా ఉండటం పరిశోదకులను ఆశ్చర్యానికి గురిచేసింది. 
 

Similar News