భారత కంపెనీలకు ట్రంప్ షాక్!

Update: 2018-10-19 09:55 GMT

హెచ్‌ 1బీ వీసా విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు ట్రంప్‌ యంత్రాగం ప్రతిపాదనలు తీసుకు రానుంది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. 2019 ఆగస్టు నాటికి హెచ్‌ 1బీ వీసా విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు సరికొత్త ప్రతిపాదనలను యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ కసరత్తులు చేస్తోంది. దీని ప్రభావం యూఎస్‌లోని భారతీయ ఐటీ కంపెనీలు, చిన్న, మధ్యతరహా కంపెనీలపై పడనుండటంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

విదేశీ కంపెనీలకు షాకిచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారు. H1B వీసా విధానంలో సవరణలు తీసుకురావాలని భావిస్తున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని భారతీయ ఐటీ కంపెనీలపై ప్రభావం పడనుందనే ఆందోళన నెలకొంది.

యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (USCIS) సంస్థ 2019 ఆగస్టు నాటికి H1B వీసా విధానంలో సవరణలు చేసేందుకు చర్యలు మొదలుపెట్టినట్లు డీహెచ్ఎస్ వెల్లడించింది. దీనివల్ల అమెరికాలోని భారతీయ ఐటీ కంపెనీలు, చిన్న, మధ్యతరహా కంపెనీలకు మళ్లీ చిక్కులు తప్పవని తెలుస్తోంది.

H1B వీసాలో సవరణలతో ప్రతిభావంతులైన విదేశీయులను ఆకర్షించాలని అమెరికా భావిస్తోంది. మరోవైపు H4 వీసాల తొలగింపు ప్రయత్నాలు కూడా భారతీయుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం H1B వీసాలతో పనిచేస్తున్నవారి భార్యలు H4 వీసాల కింద పనిచేస్తున్నారు. వాటి తొలగింపును డీహెచ్ఎస్ సమర్దిస్తున్న నేపథ్యంలో అమెరికాలోని విదేశీయుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలో ఉన్న ఇండియా, చైనా టెక్నాలజీ సంస్థలు తమ ఉద్యోగులను H1B వీసా ద్వారా అమెరికాకు తీసుకెళ్తున్నాయి. ఏటా వేల సంఖ్యలో ఉద్యోగులను తీసుకుంటున్నాయి. ఈ విధానంలో మార్పు తెచ్చినట్లయితే మున్ముందు ఆయా సంస్థలకు ఇబ్బందులు తప్పవని తెలుపుతున్నారు. 

Similar News