10 గ్రాముల గోల్డ్‌ 31వేల 350 రూపాయలు

Update: 2017-12-13 09:07 GMT

మగువలకు ఇది బ్యాడ్‌ న్యూస్‌... ఆడవాళ్లు అత్యంత ఇష్టపడే.... బంగారం ధరలు ఒకేసారి అమాంతం పెరిగాయి. డాలర్ పతనంతో గోల్డ్‌ రేట్స్‌ చుక్కలనంటాయి. పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది.

బంగారం ధరలు చుక్కలనంటాయి. ఒక్కరోజులోనే 990 రూపాయలు పెరిగింది. దాంతో 10 గ్రాముల గోల్డ్‌ 31వేల 350 రూపాయలకు చేరింది. ఈ ఏడాదిలో ఇంతగా బంగారం ధర పెరగడం ఇదే ఫస్ట్ టైమ్‌.

అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతోనే బంగారం ధర పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. డాలర్ విలువ పతనం, ఉత్తరకొరియా, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం, హరికేన్‌ ఇర్మా ప్రభావంతో పసిడి ధర పది నెలల గరిష్ఠానికి చేరింది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 1,353 డాలర్లు పలుకుతోంది.

పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి 42వేలకు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ పెరగడంతో వెండి ధర పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.

Similar News