RBI: కీలక ప్రకటన.. రూ.2వేల నోట్లు 97.96 శాతం వెనక్కి
RBI: బ్యాంకింగ్ రంగంలోకి వచ్చేశాయన్న RBI
RBI: 2వేల నోట్ల చలామణిపై RBI కీలక ప్రకటన చేసింది. 2వేల నోట్ల చలామణి 97.96శాతం మేర తిరిగి బ్యాంకింగ్ రంగంలోకి వచ్చాయని RBI ప్రకటించింది. ఇంకా 7,261 కోట్ల విలువైన 2వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని... అవి రావాల్సి ఉందని పేర్కొంది.
2023 మే 19న చెలామణి నుంచి 2వేల నోట్లను RBI ఉపసంహరించుకుంది. అప్పుడు చలామణిలో ఉన్న 2వేల నోట్ల విలువ 3లక్షల 56వేల కోట్లు. గత ఏడాది అక్టోబర్ 7దాకా దేశంలోని అన్ని బ్యాంకు శాఖల్లో 2వేల నోట్ల మార్పిడి జరిగింది.