Gold Rate Today September 4th : స్వల్పంగా తగ్గిన బంగారం ధర..తులంపై ఎంత తగ్గిందంటే

Gold Rate Today September 4th : సెప్టెంబర్ 4 బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగుముఖం పట్టాయి. నిన్నటి ధరతో పోల్చి చూసినట్లయితే బంగారం ధర 10 గ్రాముల పై 100 రూపాయలు తగ్గింది. తాజాగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,700 వద్ద పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,700 వద్ద పలుకుతోంది.

Update: 2024-09-04 02:13 GMT

బంగారం ధరలు గత నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. అటు శ్రావణమాసం కూడా ముగియడంతో పెళ్లిళ్ల సీజన్ ముగిసింది. మళ్లీ శుభముహూర్తాలకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. అయితే రాబోయే దసరా దీపావళి సందర్భంగా మరోసారి బంగారం కొనుగోళ్లకు పెద్దగా అవకాశం ఉందని ఆభరణాల దుకాణాల వారు చెప్తున్నారు. కానీ అంతర్జాతీయంగా చూసినట్లయితే బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మార్కెట్లలో భారీ పెరుగుదలను సూచిస్తున్నాయి.

అమెరికాలో బంగారం ధర 2500 డాలర్ల ఎగువన ట్రేడ్ అవుతోంది. మరోవైపు అమెరికాలో కీలకమైన ఆర్థిక డేటా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ డేటా కారణంగా అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళుతుందా లేదా అనేది తేలుతుంది. ఇదే కనుక జరిగినట్లయితే అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళుతుందనే సంకేతాలు వస్తే బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా జాబ్స్ డేటా తగ్గినట్లయితే ఆర్థిక మాంద్యం ప్రారంభమైంది అని అర్థం.

మరో వైపు కీలకమైన ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు విధానం ఈ నెలనే ప్రకటించనుంది అమెరికాలో వడ్డీ రేట్లు పావు శాతం మీద తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే కనుక జరిగినట్లయితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది బంగారం ధరలు పెరగడానికి మరో మూల కారణం చైనా విపరీతంగా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారాన్ని కొనుగోలు చేయడమే అని కూడా నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు ప్రస్తుతం 73,000 దిగువన ట్రేడ్ అవుతోంది.

పైన పేర్కొన్న పరిణామాలు చూస్తున్నట్లయితే బంగారం ధర మరోసారి 75 వేల ఆల్ టైం గరిష్ట స్థాయి రికార్డును తాకే అవకాశం కనిపిస్తోంది. బంగారం కనుక ఆ స్థాయిలో ట్రేడ్ అయితే మాత్రం మనం కొత్త గరిష్ట స్థాయిని చూస్తాము. బంగారం ధరలు గత ఏడాదికాలంగా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి గమనించినట్లయితే బంగారం ధర దాదాపు 8 వేల రూపాయల వరకు పెరిగింది. ఈ సంవత్సరమే బంగారం ధర ఆల్ టైం గరిష్ట స్థాయి 75 వేల రూపాయలను తాకింది. ఇప్పుడు మళ్ళీ ఆల్ టైం గరిష్ట స్థాయి దిశగా అడుగులు వేస్తోంది.

Tags:    

Similar News