Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్..దిగివస్తున్న బంగారం ధర
Gold Rate Today: ప్టెంబర్ 5 గురువారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు తాజాగా గమనించినట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,600 నమోదు అవగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,100 వద్ద నమోదు అవుతోంది. బంగారం ధరలు ఈ నెలలో ప్రారంభం నుంచి కూడా తగ్గుతూ వస్తున్నాయి. అయితే భవిష్యత్తులో బంగారం ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనే ప్రశ్న తలెత్తుతోంది.

దేశీయంగా చూసినట్లయితే ప్రస్తుతం శ్రావణమాసం ముగిసింది ప్రస్తుతం ఇప్పట్లో లేనట్లే ఫలితంగా బంగారు ఆభరణాలకు డిమాండ్ తగ్గుతుంది దీంతో పసిడి ధరలు స్వల్పంగా తగ్గుదల నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక కారణం అయితే అటు అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర 2520 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గతంతో పోల్చి చూసినట్లయితే బంగారం ధర 30 డాలర్లు తక్కువగా ఉంది. ఇది కూడా బంగారం ధరలు తగ్గడానికి దోహద పడింది.
దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పావు శాతం మీద తగ్గించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వడ్డీ రేట్లు తగ్గించినట్లయితే బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గించినట్లయితే అమెరికా జారీ చేసిన ట్రెజరీ బాండ్లపై రాబడి తగ్గుతుంది. ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బాండ్ల నుంచి తొలగించి బంగారం వైపు తరలించే అవకాశం ఉంది. సాధారణంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా చెబుతుంటారు.
సంక్షోభ సమయంలో తమ పెట్టుబడులను బంగారంలోనే ఎక్కువగా పెడుతుంటారు. ఇలాంటి సమయంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరగడానికి దోహదం చేస్తుంటాయి. ప్రస్తుతం అమెరికా ఆర్థిక పరిస్థితి కూడా మాంద్యం వైపు తరలుతుందని వార్తలు వస్తున్నాయి. ఇవి కూడా బంగారం ధర పెరగడానికి దోహదం చేస్తాయి. ఇదిలా ఉంటే పెరుగుతున్న బంగారం ధరల నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఒక గ్రాము తేడా వచ్చిన మీరు వేలల్లో నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
ఈ పరిస్థితి నివారించడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హాల్ మార్క్ ఉన్న బంగారాన్ని మాత్రమే విక్రయించాలని తప్పని సరి చేసింది. కావున మీరు నగల దుకాణంలో నగలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా హాల్ మార్క్ ఉందా లేదా అన్నది గమనించాలి. . హాల్ మార్క్ ఉన్న నగలను మాత్రమే కొనుగోలు చేయడం వల్ల మీరు నష్టపోయే ప్రమాదం తగ్గుతుంది.