Gold Rate Today: నేడు స్థిరంగానే బంగారం ధరలు..హైదరాబాద్లో తులం ధర ఎంతంటే?
Gold Rate Today: బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూస్తే స్థిరంగా ఉన్నాయి. సెప్టెంబర్ 6 శుక్రవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. బంగారం 24 క్యారట్ల 10 గ్రాముల ధర రూ. 72,750, అలాగే 22 క్యారట్ల 10 గ్రాముల ధర 66,750. బంగారం ధరలు గడచిన వారం రోజులుగా హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి.
Gold Rate Today: బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూస్తే స్థిరంగా ఉన్నాయి. సెప్టెంబర్ 6 శుక్రవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. బంగారం 24 క్యారట్ల 10 గ్రాముల ధర రూ. 72,750, అలాగే 22 క్యారట్ల 10 గ్రాముల ధర 66,750. బంగారం ధరలు గడచిన వారం రోజులుగా హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. అయితే ప్రస్తుతం శ్రావణమాసం సీజన్ ముగియడంతో దేశవ్యాప్తంగా వివాహాలు తగ్గుముఖం పడ్డాయి దీంతో బంగారం కొనుగోళ్లకు బ్రేక్ పడింది.
ఫలితంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. కానీ మరికొన్ని రోజుల్లో దసరా దీపావళి ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో బంగారం దేశ వ్యాప్తంగా అత్యధికంగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. సంవత్సరం మొత్తం లోనే ఈ సీజన్ గరిష్ట స్థాయి కొనుగోళ్ళను నమోదు చేస్తుంది. ఎందుకంటే బంగారం కొనుగోలు చేసే వారికి ఈ సీజన్ అత్యంత అనుకూలమైనది. దసరా దీపావళి ధన త్రయోదశి వంటి పండగలు ఈ సీజన్లో ఉంటాయి. దీంతో ఈ సీజన్లో ఎక్కువగా బంగారం కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తుంటారు.
అయితే పెరిగిన ధరల నేపథ్యంలో బంగారం కొనుగోలు తగు ముఖం పట్టే అవకాశం ఉందని ఆభరణాల దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూలై నెలలో కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై దిగుమతి సుంకం తగ్గించినప్పటికీ, బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడం ప్రారంభించాయి. ప్రస్తుతం బంగారం ధరలు రికార్డు స్థాయి సమీపంలో ట్రేడ్ అవుతున్నాయి.
బంగారం ధరలు అటు అంతర్జాతీయంగా గమనించినట్లయితే భారీ పెరుగుదలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా విడుదల చేయనున్న జాబ్స్ డేటా పైన ప్రతి ఒక్కరు దృష్టి సారించారు. ఈ జాబ్స్ డేటా ఆధారంగానే అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళుతుందా లేదా అన్న సంగతి తేలుతుంది. ఒకవేళ అమెరికా ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశిస్తున్నట్లు సూచనలు అందితే బంగారం ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది.
దీనికి తోడు ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పావు శాతం మీద తగ్గించే అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.