Credit Card Bill : క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేకపోతున్నారా..అయితే ఈ టిప్స్ పాటిస్తే ఈజీగా బిల్లు చెల్లించేయొచ్చు

Credit Card Bill : నేటి పరిస్థితుల్లో చాలా మంది తమ సంపాదన కంటే క్రెడిట్ కార్డులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఎందుకంటే మీ చేతిలో డబ్బు లేని సమయంలో క్రెడిట్ కార్డులు దిక్కవుతున్నాయి. కార్డ్ పరిమితిని ఉపయోగిస్తే మాత్రం ఇబ్బందుల్లో పడతారు. అయితే క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టలేకపోతే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మంది నిపుణులు క్రెడిట్ కార్డులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అంటారు. కాబట్టి మీరు కూడా క్రెడిట్ కార్డ్ బిల్లుల ఉచ్చులో మీరు చిక్కుకోకూడదు అనుకుంటే దాన్ని ఏయే మార్గాల్లో వదిలించుకోవచ్చో తెలుసుకుందాం.

Update: 2024-09-04 03:30 GMT

బ్యాంకును సంప్రదించండి :

మీరు బిల్లు చెల్లించలనేని సమయంలో మీరు చేయవలసిన మొదటి పని ఏమిటంటే మీ బ్యాంక్‌తో మాట్లాడటం. మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడం లాంటి పననులు చేయకూడదు. బదులుగా మీ పరిస్థితిని బ్యాంకుతో మాట్లాడండి. అటువంటి పరిస్థితిలో, బ్యాంకు మీకు కొంత సమయం ఇచ్చే అవకాశం ఉంది, తద్వారా మీ తప్పును సరిదిద్దుకోవచ్చు.

కనీస మొత్తాన్ని చెల్లిస్తూ ఉండండి:

క్రెడిట్ కార్డ్ బిల్లు ఎప్పుడు వచ్చినా అందులో రెండు రకాల మొత్తాలు ఉంటాయి. మొదటది మొత్తం బిల్లు,రెండవది కనీస మొత్తం, అంటే, మీరు మొత్తం బిల్లు చెల్లించలేకపోతే, మీరు బిల్లు చివరి తేదీ వరకు కనీస మొత్తాన్ని చెల్లించవచ్చు. ఇలా చేస్తే మీ బిల్లుపై అదనపు ఛార్జీ ఉండదు. అదే సమయంలో, బ్యాంకులు మిమ్మల్ని మళ్లీ మళ్లీ ఇబ్బంది పెట్టవు. CIBIL స్కోర్‌పై ఎటువంటి ప్రభావం ఉండదు.

PF డబ్బు మీ భవిష్యత్తు కోసం అయినప్పటికీ, మీకు కావాలంటే, మీ అవసరాన్ని బట్టి మీరు ఇక్కడ నుండి డబ్బు తీసుకోవచ్చు. ఉద్యోగం సమయంలో, మీరు ముందస్తు PF డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లించవచ్చు.

మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లును కూడా సెటిల్ చేసుకోవచ్చు. అయితే, కొన్ని EMIలు బౌన్స్ అయినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది కాబట్టి దీనికి కొంత సమయం పడుతుంది. ఇందులో మీరు సగం కంటే తక్కువ మొత్తం చెల్లించాలి, కానీ మీ CIBIL స్కోర్ దెబ్బ తింటుంది.

ఈ తప్పులు అసలు చేయవద్దు:

క్రెడిట్ కార్డు ను ఉపయోగించి మీరు ఎట్టి పరిస్థితులను ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా చేయకూడదు. అంతేకాదు మీరు క్రెడిట్ కార్డు ద్వారా ఏక మొత్తంలో డబ్బులు బయటకి తీయడం లాంటివి చేయకూడదు. మీరు క్యాష్ తో చెల్లించాలి అనుకున్నది క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించకూడదు అలాంటప్పుడు కొద్దిగా భారం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే క్రెడిట్ కార్డు ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లోనూ రెంట్ చెల్లింపులు వంటివి చేయకూడదు. ఇలా చెల్లించినట్లయితే మీపై అదనపు భారం పడే అవకాశం ఉంది.

Tags:    

Similar News