మరో వారం రోజుల్లో ఏం జరగబోతుందో అంటూ చైనా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. చైనా దేశానికి చెందిన అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్ -1 భూమిని ఢీకొట్టనుంది.
తియాంగాంగ్ -1 చైనా తన తొలి అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్ -1 ను 2011లో ప్రయోగించింది. 8,618 కిలోల బరువుంది, దీన్ని హెవెన్లీ ప్యాలెస్‌గా పిలుస్తారు.ఐదేళ్ళపాటు ఈ స్పేస్ స్టేషన్ బాగా పనిచేసింది. వ్యోమగాములను కూడ ఈ స్టేషన్‌కు పంపించారు. 2016 నుండి సాంకేతిక సమస్యలతో ఈ స్పేస్ స్టేషన్‌కు భూమితో సంబంధాలు తెగిపోయాయి.
రెండేళ్ళ క్రితమే భూమిని ఢీకొట్టే అవకాశం రెండేళ్ళ క్రితమే భూమిని చైనా అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్ -1 భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావించారు. అయితే చైనా అంతరిక్ష కేంద్రం భూమిని ఢీకొట్టకుండా శాస్త్రవేత్తలు నియంత్రిస్తున్నారు. ప్రస్తుతం అది నియంత్రణ గతి తప్పింది.
అయితే చైనా శాస్త్రవేత్తలు మాత్రం ఈ అంతరిక్ష కేంద్రానికి సముద్రంలో కూల్చివేస్తామని ప్రకటించారు. చైనాకు చెందిన అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్-1 వారం రోజుల్లో భూమి మీద కూలిపోయే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు ఈ అంతరిక్ష కేంద్రాన్ని భూమి మీదకు రాకుండా సముద్రంలో కూలిపోయే చర్యలు చేస్తున్నా ఫలితాలు ఇవ్వడం లేదనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే చైనా శాస్త్రవేత్తలు మాత్రం చైనా అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్ 1 కేంద్రాన్ని సురక్షితంగా సముద్రంలో కూల్చివేస్తామని తాజాగా ప్రకటించారు. అయితే ఈ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఎలా కూలిపోతోందోననే ఆందోళనకు చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు.
తియాంగాంగ్1 శకలాలు 43 డిగ్రీలు, దక్షిణానికి 43 డిగ్రీల మధ్య భూమిని ఢీకొనే అవకాశం ఉందని యూరోపియన్ ఏజెన్సీ అంచనా వేసింది.స్పెయిన్, టర్కీ, ఇండియా ప్రాంతాల్లో భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని అంచనా వేసింది.