ఆ హీరోయిన్ ఆత్మ‌హ‌త్య‌కు హీరోనే కార‌ణం

Update: 2018-01-31 19:24 GMT

ఆ హీరోయిన్ చేసింది ఒక్క‌సినిమానే అయినా  ప్ర‌పంచాన్ని ఆక‌ర్షించింది.  అలాంటి  హీరోయిన్ స‌డ‌న్ గా చ‌నిపోవ‌డం ఇప్ప‌టికీ సంచ‌ల‌నం రేపుతుంది. ఆమె మ‌ర‌ణంపై  అనేక అనుమానాల్ని రేకెత్తిస్తుంది.  విచార‌ణ‌లు కొన‌సాగుతున్నాయి. ఆ విచారణ‌లో ఆమె చావుకు ప్రియుడి హ‌స్తం ఉన్న‌ట్లు తేలింది. 

నిశ‌బ్ద్ సినిమాతో తెరంగ్రేటం చేసిన  జియాఖాన్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డం సంచ‌న‌లం సృష్టిస్తోంది.  2013 జూన్ 3న జుహూలోని తన ఫ్లాట్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోలేదని.. ఆమె ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారంటూ ఆమె ప్రియుడు సూరజ్ పాంచోలీపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. 
అయితే ఆమె ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌క ముందు ఓ లెట‌ర్ రాసింది. ఆ లెట‌ర్ ను స్వాధీనం చేసుకున్న‌ వైద్య బృందం  కొన్ని విష‌యాల్ని వెలుగులోకి తెచ్చింది. ఆత్మ‌హ‌త్య చేసుకునే స‌మ‌యంలో జియా గ‌ర్భ‌వ‌తి అని తేలింది. ఆ గ‌ర్భం ఇష్టంలేని సూర‌జ్ కు  తొల‌గించే ప్రయత్నించాడు.  ఆ విష‌యాన్నికూడా సూసైడ్ నోట్ లో ప్ర‌స్తావించింది. 
దీంతో పాటు "నన్ను నీకు పూర్తిగా సమర్పించుకున్నాను. కానీ.. నువ్వు అనుక్షణం నన్ను బాధపెట్టావు. నా అణువణువూ నాశనం చేశావు. నాలో పెరుగుతున్న నీ బిడ్డను చంపుకోవాల్సి వచ్చినప్పుడు ఎంత క్షోభపడ్డానో నీకు అర్థం కాదు" అని జియా రాసుకున్నారు. 
ఇదిలా ఉంటే ఈ కేసు మొద‌ట ముంబై పోలీసులు నుంచి విచార‌ణ ప్రారంభ‌మై సీబీఐకి బదిలీ అయ్యింది.   సీబీఐ ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకొని ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేయ‌గా జియా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డినా...ఆమె ఇలా ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించింది మాత్రం ప్రియుడేన‌ని తేల్చింది. దీంతో ఆమె  త‌ల్లిదండ్రులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. దేశంలో న్యాయం ఇంకా బ‌తికే ఉంద‌ని , న్యాయం కోసం నాలుగేళ్లు తిరిగి తామె విజ‌యం సాధించామ‌ని అంటున్నారు. తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించాడనే కంటే.. హంతకుడిగా గుర్తించి ఉంటే మరింత హ్యాపీగా ఉండేదానినని ఆమె పేర్కొనటం గమనార్హం. 
 

Similar News