వేడి నీటిలో కర్పూరం వేసి... స్నానం చేసి చూడండి...

Update: 2017-12-13 07:23 GMT

కర్పూరంలో 15 రకాలు ఉన్నప్పటికీ తెల్ల కర్పూరం, పచ్చ కర్పూరం చాలా ఫేమస్. ఈ కర్పూరాన్ని మంగళకరం, శుభాకరం. మంచి పరిమాళాన్ని వెదజల్లే కర్పూరాన్ని దేవాలయాల్లో పూజలో వాడతారు. స్వామివారికి పవిత్రమైన హారతి ఇచ్చేందుకు ఈ పదార్థాన్ని వినియోగిస్తారు. అందుకే పూజలో ఇదొక అమూల్యమైన పదార్థం. కాని చాలా మందికి తెలియని విషయం ఈ కర్పూరాన్ని మన శరీరానికి మంచి ఔషధంగా పుర్వకాలం నుంచి వాడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కర్పూరాన్ని కాగే నీటిలో కూడా వాడుతున్నారు. ఇలా చేస్తే నీటిలోని బ్యాక్టీరియా, కలుషిత పదార్థాలన్నీ మారి స్వచ్ఛంగా మారుతాయని వారి నమ్మకం.
 
1.స్నానం చేసే నీటిలో కొద్దిగా కర్పూరాన్ని వేసి స్నానం చేస్తే మన శరీరం మీద ఉన్న క్రిములన్నీ చనిపోతాయి.
2.మన ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని స్వచ్చంగా ఉండేలా చేస్తుంది. అంటువ్యాధులు రాకుండా చేస్తుంది.
3.కొన్ని కర్పూరం బిళ్ళలను ఒక గుడ్డలో చుట్టి రాత్రి పడుకునే ముందు మెడలో వేసుకుని ఉదయం తీసివేస్తే మన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. శరీర జీవ క్రియలు చక్కగా మారతాయి.
4.కప్పు నీటిలో కర్పూరం బిళ్ళలు వేసి మంచం కింద పెడితే దోమలు దరిచేరవు.
5.వానాకాలంలో ఈగలు సమస్య ఎక్కువగా ఉంటుంది. అర బకెట్ నీళ్ళలో ఒక గుప్పెడు వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చేవరకు మరిగించి బండలు తుడిస్తే ఈగలు అటువైపు కూడా రావు.
6.ఉదయం బ్రష్ చేసేప్పుడు దానిపై కర్పూరం వేసుకుని దంతాలు శుభ్రం చేస్తే నోటి దుర్వాసన పోతుంది. దంతాల మధ్య క్రిములు చస్తాయి .
7.చుండ్రు సమస్య ఉన్నవాళ్ళు కొబ్బరి నూనెలో కర్పూరం వేసి గంట తర్వాత దానిని జుట్టుకు రాసుకుంటే చుండ్రు సమస్య మాయమవుతుంది.
8.కళ్ళకు మేలు చేస్తుంది కాబట్టి దీనిని కాటుకగా వాడుతారు.
9.కర్పూరం మగవారిలో వీర్య వృద్దిని కలిగిస్తుంది. లైంగిక సామార్ధ్యాన్ని పెంచుతుంది. పిల్లలు లేని మగవాళ్లు దీనిని ఔషదంగా వాడితే తొందరలోనే సంతాన భాగ్యం కలుగుతుందట.
చివరగా పచ్చ కర్పూరం 5 గ్రాములు, జాజికాయి 5 గ్రాములు, జాపత్రి 5గ్రాములు.. ఈ మూడు తీసుకోని బాగా కలిసేలా దంచాలి. అలాగే వాటిలో 5 గ్రాముల ఎండుద్రాక్ష కూడా వేసి బాగా కలిసేలా నూరాలి. వీటిని చిక్కుడు గింజలంత మాత్రలుగా చేసుకుని రోజు పడుకునే ముందు వేసుకొని పడుకుంటే వీర్య వృద్ది, లైంగిక సామర్ధ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Similar News