ప్రాణమున్న ఏ జీవి అయినా... పాముకి భయపడుతుంటారు. స్నేక్ బైట్్కి ప్రాణం కోల్పోతుంటారు. అయితే పాము కాటు నుంచి విముక్తికి ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఓ గుడ్ న్యూస్ చెప్తున్నారు. సర్పాల బెడద నుంచి తప్పుంచుకునేందు, పెంపుడు జంతువులను కాపాడుకునేందుకు విషానికి విరుగుడు కనుగొన్నారు.
ఇటీవల కాలంలో పాముల బెడద ఎక్కువైంది. ఇంట్లో మొదలుకుని పొలం పనులోకెళ్లినా పాములగోలతో చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. ఇక పెంపుడు జంతువులైతే నిత్యం పాము కాటుకు బలవుతున్నాయి. చిన్నపాములు కరిస్తే ఏదోలా మందులు వాడి ప్రాణహాని నుంచి తప్పించుకోవచ్చు. అదే విష సర్పాలు కరిస్తే ప్రాణాలు పోవడం ఖాయం. అందుకే ఇలాంటి ఘటనలు పునరావృోతం కాకూడదని కంకణం కట్టుకున్న ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు మందు కనుగొన్నారు.
చాలా తక్కువ ఖర్చుతో సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా పాము విషానికి మందు కనుగొన్నారు శాస్త్రవేత్తలు. కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్... సీఎస్ఐఆర్ఓ శాస్త్రవేత్తలు విషానికి విరుగుడు కనిపెట్టారు. ఇది ప్రధానంగా పిల్లులు, కుక్కలను పాము కాటు బారి నుంచి కాపాడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. దీన్ని మరింత అభివృద్ధి చేస్తే పెద్ద వాళ్లకు వినియోగపడేలా చేసే అవకాశం ఉంది.
అయితే ఈ పాము కాటు మందు భారత్, ఇరుపొరుగు దేశాల్లో కాకుండా ఆస్ట్రేలియాలో ఎక్కువగా వాడకంలోకి రానుంది. ఆస్ట్రేలియాలో నిత్యం పాముకాటుకు బలవుతున్న వారి సంఖ్య ఎక్కువ. అంతేకాదు ఇంట్లో పెంచుకుంటున్న పెంపుడు జంతువులు ఎక్కువగా చనిపోతున్నాయి. అక్కడ సుమారు పదిరకాల విషపూరిత పాములున్నాయి. ఎలాగో వీటి బెడద నుంచి తప్పించుకోవాలని శాస్త్రవేత్తలు విక్టోరియా ప్రాంతంలోని చిన్నచిన్న బయోటిక్ కంపెనీలతో మాట్లాడి జంతువులను రక్షించే మందును కనుగొన్నారు.
త్వరలోనే ఈ మందులు మార్కెట్లలో లభిస్తాయని పరిశోధకులు తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆస్ట్రేలియన్లు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇంట్లో అల్లారు ముద్దుగా పెంచుకున్న జంతువులను బలిగొనే సైతాన్ పాములకు విరుగుడు దొరికిందంటూ సంతోషిస్తున్నారు. సో ఇక పాముకాటుకు భయపడనక్కర్లేదన్న మాట.