సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా టాలీవుడ్ హీరోయిన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. త్వరలో ‘మా’ సిల్వర్ జూబ్లీ వేడకులు అమెరికాలో జరగనున్నాయి. అయితే ఆ వేడుకలకు సాయం కావాలని కోరగా..హీరోలు ముందుకు వచ్చినా ..హీరోయిన్లు అంగీకరించలేదంటూ ఆవేధన వ్యక్తం చేశారు.
అంతేకాదు హీరోయిన్స్‌ని అమ్మా సహాయం చేయండని మేం చాలా బ్రతిమిలాడుతున్నాం. మా రాష్ట్రానికి వచ్చి కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సాయం అనే సరికి మేనేజర్స్ చూసుకుంటారని తప్పించుకుంటున్నారు. ప్రాబ్లమ్ వస్తే.. మా అసోషియేషన్ కావాలంటున్నారు. కాని విరాళం ఇవ్వలంటే మాత్రం వారికి మనసు ఒప్పడం లేదు. ఇలాంటివి ఇకపై చెల్లవు. మీరు సహాయం చేయండి. మీకు మేమూ సహాయం చేస్తాం. సహాయం చేయని హీరోయిన్స్ మాకు అవసరం లేదంటూ.. ఎవరైనా తోకాడిస్తే మాత్రం నిర్దాక్షిణ్యంగా తోకలు కట్ చేస్తాం అంటూ హీరోయిన్స్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మా అధ్యక్షుడు శివాజీరాజా.
ఇలా తమకు సపోర్ట్ చేయకపోవడాన్ని తప్పు పట్టడంలో తప్పేమీ లేదు కానీ.. అసలు వీరు పిలిస్తే రానన్న హీరోయిన్ ఎవరు? అన్నదే ఆసక్తికరం. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. మిల్కీ బ్యూటీ తమన్నా.. వీరిద్దరిని ఉద్దేశించే శివాజి రాజా ఇలాంటి డైలాగ్స్ పేల్చాడనే టాక్ వినిపిస్తోంది. గతంలో జరిగిన ఓ ఈవెంట్ కు సంబంధించి వీరిద్దరినీ అడిగారట. కానీ ఈ భామలిద్దరూ నో అనేశారనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఇప్పుడు ముందస్తుగానే ఇలా తోకలు కత్తిరించే డైలాగులు వినిపించాయని అంటున్నారు.
నిజానికి ఈ ఇద్దరు ఏదైనా కూడా డబ్బిస్తేనే చేస్తాను అనడం వారికి అలవాటైపోయింది. కాబట్టి వాళ్లకి పేమెంట్ తీసుకోకుండా చేయాలంటే ఆసక్తి రాలేదు అని రూమర్లు వినిపిస్తున్నాయి. కనీసం సోషల్ మీడియా అప్ డేట్స్ కూడా ఫ్రీగా పెట్టే అలవాటు వీరికి లేదని అంటారు. అందుకే ఇప్పుడు శివాజీరాజా నోటి నుంచి తోకల డైలాగులు రాగానే.. వీరిద్దిరి పేర్లే మొదటగా వినిపిస్తున్నాయి.