Hyundai Offers: హ్యుందాయ్ ఆఫర్ల జాతర.. ఈ మోడళ్లపై వేలల్లో డిస్కౌంట్లు

Update: 2025-01-12 14:45 GMT

Hyundai Offers: హ్యుందాయ్ జనవరి 2025లో ఫేమస్ మోడల్స్‌పై గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. దీంతో కొత్తగా హ్యూందాయ్ కారు కొనాలనుకునే వారు Exter, i20, Venue, i10 వంటి మోడళ్లపై ప్రస్తుతం భారీ పొదుపు చేయవచ్చు. ఇప్పుడు గ్రాండ్ i10 NIOSపై రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు లభిస్తుంది. ఇవన్ని MY25, MY24 మోడల్స్‌పై ఉన్నాయి. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం.

2025 మోడల్ Grand i10 NIOSపై గరిష్టంగా రూ. 23,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఇందులో రూ. 10,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు. ఎరా పెట్రోల్ వేరియంట్ మినహా అన్ని పెట్రోల్ MT, పెట్రోల్ AMT, CNG వేరియంట్‌లపై ఈ తగ్గింపు వర్తిస్తుంది.

మీరు 2024 మోడల్ Grand i10 NIOS పై మరింత పెద్ద డిస్కౌంట్‌లను క్యాష్ చేసుకోవచ్చు. బేస్ ఎరా ట్రిమ్‌పై రూ. 20,000 నగదు తగ్గింపు, CNG వేరియంట్‌పై రూ. 25,000 తగ్గింపు, NA పెట్రోల్ వేరియంట్‌లపై రూ. 45,000 నగదు తగ్గింపు ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా, కంపెనీ ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 20,000, కార్పొరేట్ బోనస్ రూ. 3,000 ఇస్తోంది. ఈ విధంగా, ఈ మోడల్‌పై మొత్తం రూ.68,000 వరకు తగ్గింపును పొందవచ్చు.

స్టైలిష్ డిజైన్, ఫీచర్‌లకు ప్రసిద్ధి చెందిన వెర్నాలో మీరు పెద్ద మొత్తంలో ఆదా చేసుకునే అవకాశాన్ని పొందుతున్నారు. హ్యుందాయ్ తన I20, వెన్యూపై కూడా ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తోంది. ఇది కాకుండా, ఎక్స్‌టర్‌పై కూడా ఆకర్షణీయమైన తగ్గింపులు అందిస్తోంది.

హ్యుందాయ్ నుండి ఈ తగ్గింపు మీకు ఇష్టమైన కారును కొనుగోలు చేయడానికి, అదే సమయంలో భారీగా ఆదా చేసుకోవడానికి ఒక సువర్ణావకాశం అని కంపెనీ చెబుతోంది. ఈ ఆఫర్‌లు పరిమిత కాలం మాత్రమే. కాబట్టి ఈ ప్రయోజనాలను పొందడానికి త్వరపడండి.

Tags:    

Similar News