ఈ సృష్టిలో అపురూపమైనది స్త్రీ... ఆమెకు మాతృత్వం అందించే అనుభూతి మరపురానిది. అమ్మను కాబోతున్నానని తెలిసిన మరుక్షణం అనిర్వచనీయమైన ఆనందానికి చిరునామాగా నిలుస్తుంది. ప్రసవ వేదనను సైతం భరిస్తూ తన ప్రతిరూపానికి జన్మనిస్తున్న సంతోషం అమ్మతనపు సౌభాగ్యానికి అద్దం పడుతుంది. జీవితంలోని మరే ఘట్టం కూడా మాతృత్వం తాలూకు మధురిమను పంచదనే సత్యం నిర్వివాదాంశం. అయితే ఈరోజుల్లో అమ్మతనం పొందాలంటే చాలాకష్టపడాల్సి వస్తుంది. వాతావరణం, ఆహారం, ఒత్తిడి రకరకాల కారణాలతో అమ్మతనానికి దూరం అవుతున్నారు. అందుకోసం వేలకు వేలు ఖర్చుపెట్టి ఆస్పత్రుల చుట్టు తిరగాల్సి వస్తుంది. కానీ ఆ దేశంలో బొమ్మల్ని పట్టుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుందనే వార్త హల్ చల్ చేస్తుంది. ఇదే అంశాన్ని ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. ఆఫ్రికాలోని లొహారి కోస్టాలో బహ్లు ట్రైబూ అనే తెగకు చెందిన వారు కొన్ని చెక్క బొమ్మల్ని తయారు చేసి వారి నివాసంలో ప్రతిష్టించేవారు. అయితే వీటి మహిమల గురించి గురించి తెలుసుకున్న జో కస్సింక్సీ అనే సంస్థ మ్యూజియాన్ని ఏర్పాటు చేసి అందులో ప్రదర్శనకు ఉంచారు. 1993 అలా ప్రదర్శనకు వచ్చిన ఓ మహిళ ఆ బొమ్మల్ని తాకడంతో ఎన్నో ఏళ్లు ఎదురు చూస్తున్న మాతృత్వాన్నిపొందింది. దీంతో ఆ మహిళకు బూమ్లెట్ అనే పాప జన్మించింది. ఈ వార్త ఆనోటా ఈనోటా పాకడంతో దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది. అంతేకాదు అమ్మతనం కోసం ఎదురు చూస్తున్న దాదాపు 12,000మంది మహిళలు ఈ బొమ్మల్ని పట్టుకున్నారు. దీంతో వారుకుడా మాతృత్వాన్ని పొందారని ఆ మ్యూజియం మేనేజర్ ఓర్లాండో తెలిపాడు.