సమ్మర్ రేస్‌లో దమ్ము చూపేందుకు విడుదలైన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో సమంతతో కలిసి జతకట్టిన రామ్ చరణ్.. ఈ మూవీలో తన నట విశ్వరూపం చూపాడని మెగాఫ్యాన్స్‌నుండి వినిపిస్తున్నమాట. అత్యంత భారీ అంచనాలతో సుమారు 1700 థియేటర్స్‌లో శుక్రవారం నాడు భారీగా విడుదలైంది ‘రంగస్థలం’. సుమారు ఏడాది తరువాత వస్తున్న రామ్ చరణ్ మూవీ కోసం గురువారం అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. అన్ని థియేటర్లలోనూ ఉదయం 5 గంటలకే షోలు స్టార్ట్ కాగా.. ఓవర్సీస్‌లో నిన్న రాత్రే స్పెషల్ ప్రిమియర్ షోలు పడటంతో చిట్టిబాబు, రామలక్ష్మిల నటనకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. సుకుమార్ టేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, చిట్టిబాబుకి అన్నగా ఆది నటన, ప్రతినాయకుడిగా జగపతిబాబు ఉగ్రరూపం, ప్రకాష్ రాజ్ సహజశైలి వెరసి.. ‘రంగస్థలం’ థియేటర్స్‌లో అభిమానులు విజయోత్సవాలను జరుపుకుంటున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద రంగస్థలం భారీగా వసూళ్లను రాబడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు .
సుమారు 160 లోకేషన్స్ లో ప్రీమియర్స్ రిలీజ్ కాగా 6 లక్షల డాలర్లకు పైగా రాబట్టినట్టు టాక్. మన కరెన్సీలో చూసుకుంటే 4 కోట్ల రూపాయలకు పై మాటే. ఇక మొదటి రోజు కలెక్షన్ రేపటికే అర మిలియన్ ఈజీగా దాటేస్తుందని ట్రేడ్ రిపోర్ట్. టాక్ పాజిటీవ్ గా ఉండడంతో గ్రాస్ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారంతం, విద్యార్థులకు సెలవు రోజులు కావడంతో రామ్ చరణ్ కెరీర్ లో టాప్ గ్రాసర్ దిశగా దూసుకుపోయినా ఆశ్చర్యం లేదని సమాచారం. ధృవ మాస్ ని పూర్తిగా మెప్పించలేకపోయినా 50 కోట్లు దాటిన నేపధ్యంలో రంగస్థలం ఈజీగా 80 దాకా రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి