మనుషుల ప్రాణాలు తీస్తున్న పువ్వు

Update: 2018-02-06 04:44 GMT

మానసిక ప్రశాంతత కోసం.. పచ్చని ప్రకృతిలో కొద్దిసేపైనా సేద తీరాలనుకుంటారు. అందుకు ఏ పార్క్‌కో, గార్డెన్‌కో వెళుతుంటారు. అలా చేస్తే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా, హాయిగా అనిపిస్తుంది. కానీ ఇంగ్లండ్‌లోని ఓ గార్డెన్ మాత్రం... ఇందుకు భిన్నం. ప్రాణం పోసే చెట్లు కాస్తా... ప్రాణాలు తీస్తున్నాయి. ఎలా అనుకుంటున్నారా..? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ప్రశాంత వాతావరణంలో... పచ్చగా కళకళలాడుతున్న ఈ చెట్లను చూస్తుంటే... మనమూ ఓ సారి ఇక్కడి వెళ్లివద్దాం అనిపిస్తుంది కదా. కానీ జగ్రత్త. ఎందుకు అంటారా... ఏ చెట్లైనా ప్రాణవాయువుని ఇస్తూ... మనిషి మనుగడకు ప్రాణం పోస్తుంటే... ఈ చెట్లు మాత్రం.... పాయిజన్‌తో ప్రాణం తీస్తాయి. 
ఇంగ్లండ్‌లో ఉన్న ఈ పాయిజన్ గార్డెన్‌లో అడుగు పెడితే ప్రాణాలు పోవాల్సిందే. అక్కడున్న ఆకులు, పువ్వులు తెంపితే అవి చంపేస్తాయి. ఇది మీకు ఆశ్యర్యం కలిగించినా... నిజమే. అందుకే ఈ గార్డెన్‌లో ఎక్కడ చూసినా డేంజర్ సింబల్‌తో హెచ్చరికలు చేస్తూ బోర్డు ఉంటుంది. దీంతో ఇటువైపుగా ఎవ్వరూ రావడానికి సాహసం చేయరు. 
గార్డెన్లో ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా బాగుంది కదా అని భావించి ఆకుల్ని లేదా గడ్డిపోచల్ని వాసన చూడడమో లేక తెంపి నోట్లో వేసుకోవడమో చేస్తే ప్రాణాలు పోవడం ఖాయం. ఎందుకంటే ఆ గార్డెన్ అంతా పచ్చగా కనిపిస్తుంది కానీ ఆ పచ్చదనంలో ప్రాణాలు తీసే విషం ఉంది. ఐదువందల సంవత్సరాల క్రితం ఇటలీలోని పాదువా గార్డెన్‌లో విషపూరితమైన ఔషధ మొక్కలు పెంచేవారట. ప్రపంచంలో ఇదే మొట్టమొదటి బొటానికల్‌ గార్డెన్. 
ఇక పాదువా గార్డెన్‌ని స్పూర్తిగా తీసుకుని ఆల్నివిక్‌ గార్డెన్‌లో ఆకుపచ్చని విషాన్ని పెంచిపోషిస్తున్నారు. కెన్నాబీస్‌, కోకాలాంటి అత్యంత విషపూరితమైన మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి. వాటన్నింటికీ ప్రత్యేమైన ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేసి పెంచుతున్నారు. 
చిత్రవిచిత్రమైన వృక్షజాతులు, రాక్షసంగా పెరిగిపోయిన పాయిజన్ చెట్లను చూడాలంటే ఇంగ్లాడ్ రావల్సిందేనని నిర్వాహకులు చెబుతున్నారు.
 

Similar News