నేడు(ఆదివారం) ఏపీ మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ఉదయం 11 గంటల 45 నిమిషాలకు కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు గవర్నర్ నరసింహన్. ఉండవల్లిలోని సీఎం గ్రీవెన్స్ హాల్‌లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. మంత్రులుగా శాసనమండలి చైర్మన్ ఎన్‌ఎండీ ఫరూఖ్‌తో పాటు ఇటీవలే మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు కుమారుడు కిడారి శ్రవణ్ కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మైనారిటీ కోటానుంచి ఎమ్మెల్యే చాంద్ బాషా, షరీఫ్, జలీల్ ఖాన్‌లు మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఫరూఖ్‌కే మంత్రి పదవి దక్కింది. ఇక మంత్రిపదవిపై ఆశలు పెట్టుకున్న అత్తార్ చాంద్ బాషాకు శాసనసభలో విప్ పదవి దక్కింది. కిడారి సర్వేశ్వరరావు మరణంతో….ఆయన కుమారుడు కిడారి శ్రవణ్ కమార్‌కు మంత్రి పదవి దక్కగా.. మంత్రి పదవితో ప్రజలకు మరింత సేవ చేసే అదృష్టం కలిగిందని.. నాన్న ఆశయాలను నెరవేరుస్తానని అన్నారు. మంత్రి వర్గంలో చోటు దక్కడం ఆనందదాయకమని అన్నారు ఫరూక్.