సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ వినియోగదారుల కోసం మరో నూతన ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూట్యూబ్ లో సగటు యూజర్.. ఎంత సమయం గడిపాడో ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు. యూజర్లు తాము ఎంతసేపు వీడియోలు చూస్తూ గడిపిందీ ఇందులో తెలుపుంతుంది. అంతేకాదు ఒకవేళ సమయానికంటే మించి యూట్యూబ్ లో వీక్షించే వారిని అప్రమత్తం చేసేలా రిమైండర్ కూడా ఇస్తుంది. ఒక్కసారి ఈ రిమైండర్ సెట్ చేసుకుంటే నిర్దేశిత సమయానికల్లా కాసేపు బ్రేక్ తీసుకోమంటూ పాప్ అప్ సందేశం ఇస్తుంది. అలాగే వివిధ యూట్యూబ్ చానెళ్లకు సంబంధించిన నోటిఫికేషన్లు అన్ని ఒకేసారి వచ్చేల ఇందులో సెట్ చేసుకునే సదుపాయం ఉంది. ప్రస్తుతం కొందరి యూజర్లకు మాత్రమే ఈ సదుపాయం ఉండగా త్వరలోనే అందరికి అందుబాటులోకి రానుంది.