హీరో నాగశౌర్య మెగా వారసురాలు నిహారికలు ఒక మనసు అనే సినిమా చేశారు. ఈ సినిమా ప్రారంభం నుంచి వీరిద్దరి గురించి రూమర్స్ క్రియేట్ అయ్యాయి. దీనిపై నాగశౌర్య స్పందిస్తూ నేను ఏ సినిమా చేస్తే ఆ హీరోయిన్ తో రూమర్స్ అంటగడుతున్నారు. దానికి నేను బాధపడడంలేదు. కుటుంబసభ్యులు కూడా పట్టించు కోవడంలేదని సూచించాడు. అంతేకాదు తనకి హీరోయిన్ అనుష్క అంటే ఇష్టమని ఆమెని వదిలేసి మిగిలిన వారి గురించి రాస్తూన్నారని సెలవిచ్చాడు.
అయితే మళ్లీ ఇప్పుడు దాదాపు మూడు సంవత్సరాల తరువాత నాగశౌర్య - నిహారికలు పెళ్లి చేసుకుంటున్నారనే పుకార్లు షికార్లు చేశాయి. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై నాగశౌర్య స్పందించాడు. తాను నిహారికను పెళ్లి చేసుకోబోతున్నానంటూ వార్తలు వస్తున్నాయి. నాకు నిహారికతోనే కాదో ఏ హీరోయిన్ తో సంబంధంలేదు. ఫ్రెండ్స్, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ రూమర్ ఎంతవరకు వెళుతుందో చూడాలి.
ఈసందర్భంగా ప్రస్తుతం తాను పెళ్లి గురించి ఆలోచించడంలేదని ..పెళ్లి చేసుకోవాలంటే అమ్మ చూసిన అమ్మాయిని అదీ ఓ 3-4 ఏళ్ల తరువాతే చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. ఈ రూమర్స్ కు ఊతం ఇచ్చేలా నాగౌశౌర్య హీరోగా వెంకీ డైరక్టర్ గా ఛలో అనే సినిమా చేశాడు. అయితే ఆ సినిమా ఫ్రీరిలీజ్ పంక్షన్ కు చిరంజీవి గెస్ట్ గా రావడానికి, నాగశౌర్య- నిహారికల మధ్య బంధమే కారణమని గుసగులు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీళ్లద్దరు రూమర్స్ ను ఖండించినా కొద్దికాలం తరువాత లవ్ కమ్ ఎరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారంటూ వార్తలు వస్తున్నాయి.