టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పుట్టా మధుపై అక్రమాస్తుల ఆరోపణలు...900 కోట్లు అక్రమంగా...

Update: 2018-09-29 08:09 GMT

టీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఆస్తులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా 900 కోట్లు అక్రమంగా సంపాదించారంటూ మంథనీ ఉప సర్పంచ్‌ సతీశ్‌ ఆరోపిస్తూ ఐటీ, సీబీఐతో పాటు ఈడీకి ఫిర్యాదు చేశారు. తన తల్లి పేరుతో చారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసిన పుట్టా సుధాకర్‌ కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 45 లో 5 కోట్ల విలువైన ఇళ్లు కొన్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే యూఏఈ, దుబాయ్‌లో హోటల్‌ కన్స్‌స్ట్రక్షన్‌ వ్యాపారంలో ఏకంగా 100 కోట్లు పెట్టుబడులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

తన క్లాస్‌ మేట్‌ అయిన శ్రీనివాస్‌ పేరుపై భువన సురయి డెవలపర్స్‌ సంస్థలో మరో 100 కోట్లు పెట్టుబడులు పెట్టారని అంతేకాకుండా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఇసుక క్వారీలో పుట్టా సుధాకర్‌ సోదరుడు పుట్టా సత్యనారాయణ పేరుపై 50 కోట్ల టర్నోవర్‌ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో భవిత శ్రీ చిట్‌ ఫండ్స్‌ పేరుతో 20 బ్రాంచీలున్నాయని అందులో పుట్టా సుధాకర్‌కు సంబంధించి 50 కోట్లు పెట్టుబడులున్నాయని తెలిపారు. మంథని మండలం విలోచవరంలో 60 లక్షలు విలువ చేసే వ్యవసాయ భూమి, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 40 ఎకరాల భూమి, అందులో 40 కోట్లతో మెడికల్‌ కాలేజీ నిర్మిస్తున్నట్లు మంథని ఉప సర్పంచ్‌ సతీశ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Similar News