హీరోయిన్ మాధవి లత జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడుపెళ్లిళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
సినీ అవకాశాల మాటు జరుగుతున్న చీకటి కోణాల్ని ప్రస్తుతం హీరోయిన్లు ఒక్కొక్కరుగా ఎండగడుతున్న సంగతి తెలిసిందే. మీ టూ అంటూ సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఉద్యమమే జరుగుతోంది. చిత్ర పరిశ్రమల్లో హీరోయిన్లకు ఎదురవుతున్న అనుమానాలు, కాస్టింగ్ కౌచ్ పేరుతో జరుగుతున్న చీకటి నిజాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న హీరోయిన్ మాధవి లత సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురుగా చేదు అనుభవాల గురించి సంచలన విషయాలు బయట పెట్టారు.
ఇండస్ట్రీలో హీరోయిన్లు శరీరాల్ని సమర్పించుకునే పద్దతి ఆగదని మాధవి అన్నారు. కొంతమంది విధిలేని పరిస్థితుల్లో ఆ పని చేస్తుంటే, మరికొంత మంది అమ్మాయిలు సినిమా అవకాశాల కోసం వారి శరీరాల్ని లంచంగా సమర్పించుకుంటున్నారని మాదవి అన్నారు. ఈ సందర్భంగా పవన్ అంతే తనకు ఎంత ఇష్టమో చెప్పే ప్రయత్నం చేశారు. తనకు చిన్న తనం నుంచే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఏర్పడిందని మాధవి అన్నారు. నటుడిగా కంటే ఆయన వ్యక్తిగా ఎక్కువమంది అభిమానులని సంపాదించుకున్నారని మాధవి తెలిపింది. ప్రజలకు సాయపడే గుణం చూసి నేను కూడా పవన్ ని ఇష్టపడ్డానని మాధవి తెలిపింది. 15 ఏళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ కోసం ఆరు పేజీల ప్రేమ లేఖ రాసుకున్నానని మాధవి తెలిపింది. ఇప్పటికి ఆ లేఖ తనవద్దే ఉందని మాధవి వెల్లడించింది.
తాజాగా ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ మీద కొందరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నోళ్లు కూడా సమాజ సేవ చేస్తారా? అంటూ వెటకారం చేస్తున్నారు. రెండు మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ హాట్ టాపిక్ అయిన హీరోయిన్ మాధవి లత... ఆయన 3 వివాహాలపై కూడా స్పందించారు.
రేణు దేశాయ్‌కి అన్యాయం, మోసం జరిగి ఉంటే... పవన్ కళ్యాణ్ లీగల్‌గా అందరికీ విడాకులు ఇచ్చేసే మూడో పెళ్లి చేసుకున్నారు. ఆయన నిజంగా అన్యాయం చేసి ఉంటే, మోసం చేసి ఉంటే రేణు దేశాయ్ ఇప్పటికీ అంత గౌరవంగా ఎందుకు మాట్లాడుతుంది? నో కామెంట్స్ అని ఒకటే మాట చెప్పేది. ఆమె ఏ రోజూ అలాంటి వర్డ్స్ యూజ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు ఆమె చాలా ఎగ్జైట్ అవుతారు.... అని మాధవి లత తెలిపారు.
దేవుళ్లు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోలేదా? అలా అని పవన్ కళ్యాణ్‌ను నేను దేవుడు అనడం లేదు, ఆయన మంచి మనిషి... సమాజానికి మంచి చేయాలనుకుంటున్న మనిషి... దేవుడు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు అంటే కొందరు సందర్భం అలా కలిసొచ్చింది చేసుకున్నారని చెబుతుంటారు. పవన్ కళ్యాణ్‌కు కూడా అలాంటి సందర్భం కలిసొచ్చిందేమో? అక్కడ దేవుడు ఎవరికీ విడాకులు ఇవ్వలేదు. ఒకరు ఉండగానే ఇంకొకరిని చేసుకున్నారు... అని మాధవి లత అన్నారు.